మాసీ జగన్నాథమ్‌! | 'DJ' makers release new poster on Allu Arjun's birthday | Sakshi
Sakshi News home page

మాసీ జగన్నాథమ్‌!

Published Sat, Apr 8 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

మాసీ జగన్నాథమ్‌!

మాసీ జగన్నాథమ్‌!

కూరగాయలతో నిండిన కలర్‌ఫుల్‌ స్కూటరూ... డ్రైవింగ్‌ సీటులో జగన్నాథమ్‌ హుషారూ... పూజలు, ప్రేమ పదనిసలు... అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌లో హీరో క్యారెక్టర్‌లో సాఫ్ట్‌ కార్నర్‌ను మాత్రమే ఎక్కువ చూపించారు. టీజర్‌ చివర్లో యాంగ్రీ అండ్‌ ఎమోషనల్‌ ఎక్స్‌ప్రెషన్‌ చూపించినా, డైలాగ్‌ మ్యూట్‌ చేయడంతో ప్రేక్షకులకు ఆ డైలాగ్‌ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.

ఆ సంగతలా ఉంచితే... జగన్నాథమ్‌ టీజర్‌లో చూపించినంత సాఫ్ట్‌ మాత్రం కాదు, ఊర మాస్‌ అట! విలన్లను చితక్కొట్టే మాసీ ఫైట్స్‌ కూడా సినిమాలో ఉన్నాయట. అందుకు సాంపిల్‌ అన్నట్టుగా అల్లు అర్జున్‌ బర్త్‌డే (శనివారం) సందర్భంగా ఈ స్టిల్‌ రిలీజ్‌ చేశారు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ సినిమా సంగతి పక్కన పెడితే.... శనివారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్‌ కేక్‌ కట్‌ చేసి, పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నాగబాబు, అల్లు శిరీష్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement