అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా! | దువ్వాడ జగన్నాథమ్‌ చిత్రం ఈ రోజు విడుదల కానుంది. | Sakshi
Sakshi News home page

అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా!

Published Thu, Jun 22 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా!

అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా!

అల్లుఅర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్‌). ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హరీష్‌ శంకర్‌ చెప్పిన విశేషాలు.
 
► కళ్ళముందు అన్యాయం జరుగుతున్నప్పుడు వెయ్యి తుపాకులు, వంద కత్తులు తీసుకుని ఎవర్నైనా ఎదిరించాలనిపిస్తుంది. కానీ, బాధ్యతలు మన ఎమోషన్స్‌ను కంట్రోల్‌ చేస్తాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోలేం. ఇలాంటి ఎమోషన్స్‌ కలిగిన వ్యక్తి అన్యాయానికి ఎదురెళితే ఎలా ఉంటుందనేది ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్‌) సినిమాలో చూపించాం. బన్నీ (అల్లు అర్జున్‌), దిల్‌రాజు కాంబినేషన్‌లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఆ కల ఈ సినిమాతో నెరవేరింది.
     
ఇందులో స్టైలిష్‌ బ్రాహ్మిణ్‌ క్యారెక్టర్‌లో బన్నీని చూస్తారు. ఇదివరకు నా సినిమాలో టచ్‌ చేయని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాం. బన్నీ క్యారెక్టర్‌లో టూ షేడ్స్‌ ఉన్నాయా? లేక బన్నీ డబుల్‌ క్యారెక్టర్‌ చేశాడా? సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు తెలిసిపోతుంది. బ్రాహ్మణ పాత్రలో నటించేందుకు బన్నీ డెడికేషన్‌ చూసి షాక్‌ అయ్యాను. 365 డేస్‌లో షూటింగ్‌ ఎప్పుడున్నా నేను రెడీ అనే యాక్టర్‌ బన్నీనే. ఈ సినిమా ప్రీ–క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ సీన్‌ నేనిప్పటి వరకు తీసిన సినిమాల్లోకెల్లా ది బెస్ట్‌.
    
► బూతు భాషలో ఉండదు. అర్థం చేసుకునే భావంలో ఉంటుంది. నిర్మాతలు, దర్శకులు ఇతరుల మనోభావాలను కించపరచాలని సినిమాలు తీయరు. ‘డీజే’ సినిమాలో అభ్యంతరం వ్యక్తం చేసిన పదాలను తొలగించాం. ఆ పదాలు తీసేసిన తర్వాత కూడా కొందరు తొలగించలేదని నిందించారు. అప్పుడు కాస్త బాధగా అనిపించింది.
     
ఇండస్ట్రీలో మనుషులను నమ్మరు. సక్సెస్‌నే నమ్ముతారు. మనకన్నా మన సక్సెస్సే ఎక్కువగా మాట్లాడుతుంది. నిజానికి హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా సక్సెస్‌నే చూస్తారు. సక్సెస్‌ వచ్చిందని పొంగిపోను. ఫ్లాప్‌ వచ్చిందని డీలా పడిపోను. నా మీద నాకు నమ్మకం ఎక్కవ. విమర్శలను స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమే. ‘డీజే’ టైటిల్‌ ప్రేక్షకుల్లోకి చాలా స్పీడ్‌గా వెళ్లింది. సౌతిండియాలోనే ‘డీజే’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టెక్నాలజీని చదువుకున్నవారే ఎక్కువగా వాడతారు. వీడియో మీకు నచ్చకపోతే డిస్‌లైక్‌ కొట్టమని యూట్యూబ్‌లో ఆప్షన్‌ ఉంది. కానీ, కావాలని చేసేవారికి అది ఎంత వరకు సమంజసమో వారి విజ్ఞత, జ్ఞానానికే వదిలేస్తున్నాం.
     
పవన్‌కల్యాణ్‌ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఆయన కోసం స్పెషల్‌ స్క్రిప్ట్‌ రాస్తున్నాను. పవన్‌ ‘డీజే’ సినిమాను చూస్తానంటే ‘దిల్‌’రాజు, బన్నీ, నాకు అంతకుమించిన ఆనందం లేదు. తప్పకుండా స్పెషల్‌ షో వేస్తాం. చిరంజీవిగారి సినిమా కోసం థాట్‌ వచ్చింది. ఆయనతో ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ వంటి ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా తీయాలని ఉంది.
     
‘హ్యూమన్‌ రిలేషన్స్‌’ బేస్డ్‌ సినిమాలను ప్రొడ్యూస్‌ చేయాలనుకుంటున్నాను. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటే కొత్త డైరెక్టర్లను ప్రొత్సహించేందుకు రెడీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement