
రొమాంటిక్ జగన్నాథమ్
ద్యావుడా... ఇదేం పని? స్కూటరేసుకుని మార్కెట్‌కి వెళ్లామా? కూరగాయలు తెచ్చుకుని, వంట చేశామా? అన్నట్లు ఉండే జగన్నాథమ్ ఇలా సూటూ బూటూ వేసుకోవడం ఏంటి? వేర్ ఈజ్ ది పంచ్ కట్టు జగన్నాథా? అని ‘దువ్వాడ జగన్నాథమ్’లోని ఈ కొత్త స్టిల్ చూసి అనుకుంటున్నారా? మనోడు వంటోడే అయినా లోపల ఇంకా ఏదో ఉంది. ఆ యాంగిల్ ఏంటి? అనేది సినిమాలో చూస్తారు. ఆ పాత్ర తాలూకుదే ఈ స్టిల్.
పంచె కట్టులో పసందుగా కనిపించిన జగన్నాథమ్ సూటూ బూటులో సూపర్బ్‌గా ఉన్నాడు కదూ. ఈ లేటెస్ట్ స్టిల్‌ను సోమవారం విడుదల చేశారు. ఓ రొమాంటిక్ సాంగ్‌కి సంబంధించిన ఈ ఫొటోలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగుంది కదూ. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. సినిమాని జూన్ 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు– శిరీష్ నిర్మిస్తున్నారు.