పవర్ స్టార్ బాటలో బన్నీ
గతంలో తన సినిమాలకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించని పవన్ కళ్యాణ్, ఇటీవల కాస్త రూటూ మారుస్తున్నారు. తన సినిమా ఫంక్షన్లకే కాదు అడపాదడపా తనను అభిమానించే వారి ఆడియో వేడుకలకు ఇతర ఫంక్షన్లకు హాజరవుతున్నారు. నితిన్ లాంటి యంగ్ హీరోస్ను సపోర్ట్ చేయటమే కాదు. సప్తగిరి లాంటి కమెడియన్ హీరోగా మారుతున్న సినిమా ఆడియో వేడుకకు కూడా హాజరై ఎంకరేజ్ చేస్తున్నాడు.
ఇప్పుడు అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్లో బిజీగా ఉన్న బన్నీ, రెండు చిన్న సినిమాల ఆడియో వేడుకలకు హాజరు కానున్నడట. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో పాటు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి లీడ్ రోల్లో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ఆడియో రిలీజ్కు కూడా బన్నీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.