
దువ్వాడ దుమ్ము లేపుతున్నాడు!
వంటలు చేసే పంతులే కదా... కూరలో కరివేపాకులా ఏరి పారేయొచ్చు! పంచె కట్టుకున్నాడు... మనల్ని చూస్తేనే పరుగులు తీస్తాడు అనుకున్నోళ్లు దువ్వాడ దుమ్ము లేపుతుంటే... అతడికి దూరంగా పరుగులు తీయడానికి దారులు వెతుక్కుంటున్నారు. షూటింగ్‌లో ఈ సీన్ చూసినోళ్లు... ‘దువ్వాడ జగన్నాథమ్’ క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ విశ్వరూపం చూపిస్తాడని చెబుతున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌లో జరుగుతోంది. క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ కాకుండా, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట! ఓ పక్క షూటింగ్ చేస్తూనే, మరోపక్క డబ్బింగ్ పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రీసెంట్‌గా ఆడియో టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో పాటల్ని విడుదల చేయనున్నారు.