
పాతబస్తీలో జగన్నాథమ్
హైదరాబాద్‌లో పాతబస్తీ పేరు వింటే చార్మినార్, మక్కా మసీద్, హడావిడి షాపింగ్.. గట్రా గుర్తు రావడం సహజమే. వీటన్నిటి మధ్య ఓ బ్రాహ్మణ యువకుడు ఏం చేశాడు? అతడి కహానీ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాత బస్తీలో జరుగుతోంది.
అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్న సన్నివేశాలను పాత బస్తీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 4న అల్లు అర్జున్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. హీరోయిన్ పూజా హెగ్డే కూడా కొన్ని రోజులు చిత్రీకరణలో పాల్గొన్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్, రమేశ్ రెడ్డి.