
భజే భజే... డీజే
జ్వాలా త్రినేత్రుడు... విద్రోహులపై రుద్ర తాండవం చేసే వీరుడు... లోక కంటకుల గుండెలు అదిరేలా మృత్యుగంట మోగించేవాడు... అతనెవరో కాదు, దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజే! టీజర్‌లో అల్లు అర్జున్ వంట బ్రాహ్మణుడిగా కనిపించారు.
అది జస్ట్ సాంపిల్ మాత్రమే. సినిమాలో జగన్నాథమ్ విశ్వరూపం చూపిస్తాడని టైటిల్ సాంగులో క్లారిటీ ఇచ్చేశారు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’లో జొన్నవిత్తుల రాసిన ‘శరణం భజే భజే... డీజే’ పాటను సోమవారం విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట క్యాచీగా ఉందంటున్నారు నెటిజన్లు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయాలనుకుంటున్నారు.