ఉగాదికి వస్తున్నా | Vijay Deverakonda: VD12 First Look Released | Sakshi
Sakshi News home page

ఉగాదికి వస్తున్నా

Published Sat, Aug 3 2024 12:34 AM | Last Updated on Sat, Aug 3 2024 11:05 AM

Vijay Deverakonda: VD12 First Look Released

ఉగాదికి థియేటర్స్‌లో కలుద్దాం అంటున్నారు విజయ్‌ దేవరకొండ. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో 12వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి, మూవీని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం విడుదలను ΄్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇప్పటివరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే టైటిల్‌ను, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో విజయ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారనీ టాక్‌. ఈ సినిమాకు కెమెరా: గిరీష్‌ గంగాధరన్, జోమోన్‌ టి. జాన్, సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement