వింటేజ్‌ యాక్షన్‌ | matka Movie nunchi first look poster release | Sakshi
Sakshi News home page

వింటేజ్‌ యాక్షన్‌

Published Mon, Aug 12 2024 12:58 AM | Last Updated on Mon, Aug 12 2024 12:58 AM

matka Movie nunchi first look poster release

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘మట్కా’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లు. కరుణకుమార్‌ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై డా. విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఇరవైనాలుగేళ్ల టైమ్‌లైన్‌తో సాగే ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ నాలుగు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. సిగార్‌ తాగుతూ కనిపిస్తున్న వరుణ్‌ తేజ్‌ డ్రెస్సింగ్, హెయిర్‌ స్టైల్‌లో వింటేజ్‌ వైబ్‌ కనిపిస్తోంది. నవీన్‌ చంద్ర, సలోని, అజయ్‌ ఘోష్, పి. రవిశంకర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement