విలక్షణ నటుడు రానా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవిప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి.
తాజాగా దీనిపై డైరెక్టర్ వేణు ఊడుగుల స్పందించాడు. విరాటపర్వం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఎప్పటికైనా థియేటర్లలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనాతో థియేటర్లు మూదపడ్డాయని, పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపారు.
విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment