తెగించిన వాడికి తెడ్డే అన్నట్టు బిగ్‌బాస్ ఆఖరి దశకు చేరుకునే సమయంలో బాగా బోల్డ్ కంటెంట్‌తో ముందుకు వెళుతోంది. ఈ వారమంతా నామినేషన్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఈ బోల్డ్ కంటెంట్‌తోనే ఈ వారమంతా నడిచిందని చెప్పొచ్చు. ముందుగా ఈ వారం చివరి చీఫ్ కంటెండర్ జరిగిన పోటీలో పార్టిసిపెంట్స్ పదజాలం బాగా బోల్డ్. మెగా చీఫ్‌గా గెలిచిన రోహిణి, దానికోసం పోటీ పడ్డ విష్ణుప్రియ మధ్య సంభాషణంతా సాలిడ్ బోల్డ్.
విష్ణు ఓపెన్‌గా రోహిణి క్యారెక్టర్‌పై నిందవేస్తే.. రోహిణి ఏకంగా నువ్వు ఒకరిని ఇష్టపడి వారు దొరకక ఇంకొకరి కోసం ప్రయత్నించావని విష్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ రకంగా ఇటువంటివి బుల్లితెరలో అదీ తెలుగు ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా కొత్త అని చెప్పొచ్చు. ప్రేక్షకుల పరంగా పరమ చెత్త అనొచ్చు. నాలుగు గోడల మధ్య ఆవేశపడితే ఇంటి గుట్టవుతుంది, అదే లక్షలాది ప్రేక్షకుల మధ్య అసభ్యంగా మాట్లాడితే అదే గుట్టు రట్టవుతుంది. ఈ విషయం కంటెస్టెంట్స్‌కు తెలిసినా తెలియకపోయినా బిగ్‌బాస్‌కు మాత్రం తెలుసు. ఎందుకంటే అదే బిగ్‌బాస్‌కు లాభదాయకం కాబట్టి.
(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?)
వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్లపై కంప్లైంట్లను ఓ చక్కటి ఆట రూపేణా చూపడం కొంతవరకు బావుంది. ఈ వారం యశ్మి ఎలిమినేట్ అవడం అటు కంటెస్టెంట్లకు ఇటు యష్మికి ఏ మాత్రం బాధ కలిగించలేదన్నది వాస్తవం. యష్మి వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ రూపేణా గౌతమ్‌ను నేరుగా నామినేట్ చేసింది. ఈ వారం ఓ విషయమైతే చెప్పుకోవాలి, హౌసులో గ్రూపిజం సరిగ్గా ఉందో లేదో కాని బయట సోషల్ మీడియాలో మాత్రం బిగ్‌బాస్‌పై కుల, ప్రాంత, మతతత్వాలతో కొట్టుకు చస్తున్నారు కొందరు అమాయక నెటిజన్లు.
ఏ సంబంధం లేని వారి కోసం తమ విలువైన టైమ్ వెచ్చించి అర్ధం లేని కార్యక్రమం కోసం తమ జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్న సోషలోళ్లు మీకు హాట్సాఫ్. దీనికంతటికీ కారణజన్ముడు ఆ బిగ్‌బాస్ మహానుభావుడని వేరే చెప్పాలా!
-ఇంటూరు హరికృష్ణ
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment