బిగ్‌బాస్ 8 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. దీంతో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. మెగాచీఫ్ రోహిణి తప్పితే విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ టూ ఫినాలే కూడా షురూ చేశారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 26) ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది చూద్దాం.
(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)
నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ అయ్యింది. గతవారం ఈ సీజన్‌లోని పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లలో పాల్గొన్న పలువురు హౌస్‌మేట్స్ వచ్చారు. టికెట్ టూ ఫినాలే పోటీలు పెట్టారు. నాలుగో సీజన్ ఫేమ్ అఖిల్ సార్ధక్, అలేఖ్య హారిక తొలుత వచ్చారు. వీరిని చూసి హౌస్‌మేట్స్ షాకయ్యారు. ఏందిరా బాబు మరో సెట్.. వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటా అని భయపడ్డారు. కానీ విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు.
వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్.. విష్ణుప్రియను ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్స్ వేశాడు. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్లకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్‌షిప్‌లో నాకు ఇది రైట్ అనిపించలేదు. అది మార్చుకుంటే బావుంటుందేమోనని అనిపించింది.. విష్ణు నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ అన్నాడు.
(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
దీంతో విష్ణుప్రియ రియాక్ట్ అయింది. 'ఓ వ్యక్తిపై ఇష్టం మాత్రమే.. అది ప్రేమనా లేదంటే ఇంకేమైనా అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100 శాతం నాకు నేనులానే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇది జరుగుతుండగా హారిక.. పృథ్వీ దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేశా. ఈ రిలేషన్‌షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు.. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ ఖరాఖండీగా చెప్పేశాడు.
ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు-అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ సాగింది. కానీ చివరకు అసలు ఈమెని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకుని నోరు మూసుకోవడంతో ఎండ్ అయింది. ఇన్నాళ్లు లవ్ బర్డ్స్ అన్నట్లు తెగ పోజులు కొట్టారు కానీ వీళ్లిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్-హారిక అడగడం.. విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైంది. టికెట్ టూ ఫినాలే కోసం పోటీదారుల్ని సెలెక్ట్ చేయాలని అఖిల్-హారికకు బిగ్‌బాస్ చెప్పగా.. వీళ్లిద్దరూ గౌతమ్, రోహిణిని తొలుత ఎంపిక చేశారు. మరో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలని చెప్పగా.. తేజ, విష్ణుప్రియని పోటీలోకి దించారు.
(ఇదీ చదవండి: హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)
ఈ నలుగురికి కలిపి 'ది లిమిట్‌లెస్ బ్రిడ్జి' టాస్క్ పెట్టారు హౌసులోకి వచ్చిన అఖిల్-హారిక. ఇందులో చకచకా బ్రిడ్జి కంప్లీట్ చేసిన రోహిణి విజేతగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ పూర్తి చేశారు. టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకూ చేయలేకపోయాడు. ఈ పోటీలో గెలిచిన రోహిణికి తదుపరి ఛాలెంజ్‌లో పెద్ద ప్రయోజనం లభిస్తుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. తులాభారం' అని మరో టాస్క్ కూడా పెట్టారు. ఇందులోనూ రోహిణి విజేతగా నిలిచింది. ఈ రెండు టాస్క్‌ల బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ బ్యాడ్జి దక్కిన వారికి ఇక టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు వీల్లేదు. రేసు నుంచి తప్పుకున్నట్లే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.
అఖిల్-హారిక డిసైడ్ చేసుకుని విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జిని ఇచ్చారు. దీంతో విష్ణు ఏడుపు మొదలుపెట్టింది. తేజ కంటే బాగానే ఆడాను కదా అని పృథ్వీ దగ్గరకొచ్చి తెగ బాధపడిపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. విష్ణు.. టికెట్ టూ ఫినాలే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది కాబట్టి ఈవారం ఆమె ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!)
Comments
Please login to add a commentAdd a comment