కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమ కమిషన్ మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న ఛేదు అనుభవాలను బహిరంగంగా వెలిబుచ్చుతున్నారు. దీంతో హేమ కమిషన్ తరహాలోనే కోలీవుడ్‌లోనూ నడిగర్ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో ఆమెకు పలు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: 'తప్పు చేశా.. క్షమించు కన్నా'.., సీత త్యాగం.. ఏడ్చేసిన కంటెస్టెంట్లు
కాగా ఆమె శుక్రవారం డాక్టర్ కాంతరాజ్‌పై చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో డాక్టర్ కాంతరాజ్ ఒక యూట్యూబ్ ఛానల్‌లో సినీ నటీమణులందరూ వ్యభిచారులే అన్నట్లు మాట్లాడారు. నటీమణులు కెమెరామెన్, లైట్‌మెన్, మేకప్‌మెన్, దర్శకుడు అంటూ కోరుకునే వారందరికి ఎడ్జెస్ట్‌మెంట్ చేసుకుని నటించే అవకాశాలను పొందుతున్నట్లు పేర్కొని అందరు నటీమణులను అవమానించే విధంగా ఆయన మాట్లాడారన్నారు. అలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కాంతరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆ యూట్యూబ్ ఛానల్‌లోని ఆయన ఇంటర్వ్యూను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment