‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌ | Bigg Boss Telugu 3 Seven Contestants Nominated For Elimination From House | Sakshi
Sakshi News home page

ఈ వారం ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

Published Tue, Aug 13 2019 5:12 AM | Last Updated on Thu, Aug 15 2019 3:56 PM

Bigg Boss Telugu 3 Seven Contestants Nominated For Elimination From House - Sakshi

తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న ‘బిగ్‌బాస్‌ 3’ విజయవంతంగా మూడువారాలు పూర్తి చేసుకొని నాల్గవ వారంలోకి అడుగుపెట్టింది. వారాంతం ఎలిమినేషన్‌కు సోమవారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అయితే ఈ వారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్‌ చేసే విధానం కాస్త విభిన్నంగా సాగింది. ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులను పిలిచి నామినేషన్‌ పక్రియ జరిపారు. ఇద్దరిలో ఎవరు సేవ్‌ అవుతారో, ఎవరు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతారో వాళ్లే చర్చించుకొని బిగ్‌బాస్‌కు చెప్పాలి. పునర్నవి, అలీ రెజాలకు ఇమ్యూనిటీ లభించిన కారణంగా వారిద్దరు నామినేషన్‌కు వెళ్లలేదు.

ఇక శ్రీముఖి గత వారం టాస్క్‌లో తప్పు చేసిన కారణంగా ఆమె డైరెక్టుగా ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు. మిగిలిన వారిలో మొదటగా వితిక, రవిలు వెళ్లి ఎలిమినేషన్‌పై చర్చించుకున్నారు. టాస్క్‌ సమయంలో తాను తప్పు చేశాను కనుక ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతాను అంటూ రవి చెప్పాడు. ఇక శివ జ్యోతి రోహిణిలలో శివజ్యోతి నామినేట్‌ అయి రోహిణిని సేవ్‌ చేసింది. వరుణ్‌, మహేష్‌లలో మహేష్‌ సేవ్‌ అవ్వగా వరుణ్‌ ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యాడు. అషూరెడ్డి, బాబా భాస్కర్‌లలో అషూ సేవ్‌ అవ్వగా బాబా భాస్కర్‌ ఎలిమినేషన్‌లో ఉన్నాడు. రాహుల్‌, హిమజలలో రాహుల్‌ ఎలిమినేషన్‌లో నిలిచాడు. 

(చదవండి : హౌస్‌మేట్స్‌పై తమన్నా సంచలన కామెంట్స్‌)

బిగ్‌బాస్‌ సీరియస్‌.. ఇద్దరు నేరుగా ఎలిమినేషన్‌కు నామినేట్‌
‘బిగ్‌బాస్‌’ లో ఎలిమినేషన్‌ ప్రక్రియ ఎంత ప్రాధాన్యమైనదో అందరికీ తెలుసు. ఇంట్లో బిగ్‌బాస్‌ పెట్టిన కండీషన్స్‌ను ఎవరూ బ్రేక్‌ చేయరాదు. అయితే ఎలిమినేషన్‌ ప్రక్రియ సందర్భంగా శివజ్యోతి, రోహిణిలు బిగ్‌బాస్‌ పెట్టిన నియమాలను ఉల్లంఘించారు. ఎలిమినేషన్స్‌కు నామినేషన్‌ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులతో మాట్లాడకూడదని, ఈ విషయాన్ని ఇంట్లో చర్చించకూడదని బిగ్‌బాస్‌ మొదటగానే అందరికి సూచించారు. అయినప్పటికీ శివజ్యోతి, రోహిణిలు ఇంట్లో నామినేషన్‌ గురించి చర్చించుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌ వారిపై సీరియస్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ నియమాలను ఉల్లంఘించినందుకుగాను వారిపై ఎలిమినేషన్‌ వేటు వేశాడు. ఇప్పటికే ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన శివజ్యోతిని వచ్చే వారం నేరుగా ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేశాడు. రోహిణిని ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేస్తూ బిగ్‌బాస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మొత్తంగా ఈ వారం ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. కాగా గత మూడు వారాలలో వరుసగా  హేమ, జాఫర్‌, తమన్నా ‘బిగ్‌బాస్‌’ నుంచి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. మరి ఈ వారం బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement