
‘అరె ఏమైయ్యింది ఉన్నట్టుండి ఇవ్వాళే... అలవాటే లేని ఏవో ఆనందాలే..’ అంటూ మొదలవుతుంది ‘సరిపోదా శనివారం’ సినిమాలోని ‘ఉల్లాసం’ పాట. నాని, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ‘సరిపోదా శనివారం’ సినిమాలోని ‘ఉల్లాసం’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఉల్లాసం ఉరికే ఎదలో... ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో... ఉప్పుంగే ఊహల జడిలో... మనకే మనమే ఎవరో...’ అంటూ సాగే ‘ఉల్లాసం’ పాటను సినరే రాయగా, సంజిత్ హెగ్డే–ముత్యాల కృష్ణ లాస్య పాడారు. ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్.