
నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ కనిపించని ఇంటెన్స్ పవర్–ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నాని కనిపించనున్నారు. హై బడ్జెట్‌తో యూనిక్ అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించాం. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అద్భుతమైన సెట్‌ను నిర్మించాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న ఈ సినిమా విడుదల కానుంది’’ అన్నారు. సాయికుమార్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి.
Comments
Please login to add a commentAdd a comment