Ravi Teja Dhamaka Movie: New Schedule Started With Action Scenes - Sakshi
Sakshi News home page

Dhamaka Movie: రవితేజ 'ధమాకా' కొత్త షెడ్యూల్​.. భారీ బడ్జెట్​తో సెట్​

Published Sat, Feb 26 2022 7:56 AM

Ravi Teja Dhamaka New Schedule Started With Action Scenes - Sakshi

Ravi Teja Dhamaka New Schedule Started With Action Scenes: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్​ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు మాస్​ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ ఫుల్​ జోష్​తో షూటింగ్ పూర్తి చేస్తూ దూసుకుపోతున్నాడు. ఫిబ్రవరి '11న ఖిలాడీ' సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించగా ఇటీవలే 'రావణాసుర' సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నాడు రవితేజ. తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ధమాకా'. 'డబుల్​ ఇంపాక్ట్​' అనేది క్యాప్షన్. 

పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్​ నిర్మాత. అయితే ఈ సినిమా కొత్త షెడ్యూల్​ శుక్రవారం (ఫిబ్రవరి 25) హైదరాబాద్​లో ప్రారంభమైంది. ఈ ధమాకా సినిమా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్​లో రవితేజతో యాక్షన్​ సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్​ సన్నివేశాలు ప్రముఖ ఫైట్​ మాస్టర్లు రామ్​ లక్ష్మణ్​ సారథ్యంలో జరుగుతున్నాయి. వినోదాత్మకంగా ఉంటూనే మాస్​ అంశాలు ఉన్న ఈ సినిమాలో కీలకమైన పోరాటమిది అని నిర్మాత తెలిపారు. అందుకే భారీ బడ్జెట్​తో ప్రత్యేకంగా సెట్​ను రూపొందించినట్లు పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement