జగన్ సమీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు | Sakshi
Sakshi News home page

జగన్ సమీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Published Wed, Jul 23 2014 12:01 AM

జగన్ సమీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24 నుంచి చేపట్టనున్న నియోజకవర్గాల సమీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 24వ తేదీ ఉదయం 9 గంటలకు వినుకొండ, నరసరావుపేట, 12 గంటలకు సత్తెనపల్లి, పెదకూరపాడు, మధ్యాహ్నం 2 గంటలకు మాచర్ల, గురజాల నియోజకవర్గాలపై సమీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
 
 25వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు, మధ్యాహ్నం 12 గంటలకు పొన్నూరు, ప్రత్తిపాడు, మధ్యాహ్నం 2 గంటలకు తాడికొండ, మంగళగిరి, 5 గంటలకు తెనాలి, చిలకలూరిపేట, 7 గంటలకు రేపల్లె నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతుందని వెల్లడించారు.
 
 26వ తేదీ ఉదయం 9 గంటలకు బాపట్ల, వేమూరు నియోజకవర్గాలపై సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈ మార్పులను పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement