డబ్బు ఎవరిది? | Rashmika Mandanna First Look Poster Released From Kubera Movie, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Kubera Movie Update: డబ్బు ఎవరిది?

Published Sat, Jul 6 2024 4:47 AM | Last Updated on Sat, Jul 6 2024 11:11 AM

Kubera: Rashmika Mandanna first look released

ఇక్కడ రష్మికా మందన్నా చేతిలో ఉన్న పెద్ద సూట్‌ కేసును చూశారుగా! ఈ సూట్‌కేసు నిండా డబ్బు కట్టలే. ఈ సూట్‌కేసును రాత్రి వేళ తవ్వి బయటకు తీశారు రష్మిక. మరి... ఈ డబ్బు ఎవరిది? రష్మికా మందన్నా ఇంత రహస్యంగా డబ్బును ఎందుకు తవ్వి తీశారు? అనే విషయాలు ‘కుబేర’ సినిమాలో తెలుస్తాయి.

నాగార్జున, ధనుష్‌ హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా, జిమ్‌ సర్ఫ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సోషల్‌ డ్రామాను సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం రష్మికా మందన్నా ఫస్ట్‌ లుక్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement