
దేశగర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా. ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించిన ఈ లెజెండ్, ఆయన సంగీత దర్శకత్వంలో పలు గీతాలను ఆలపించారు. అయితే ఇతర సంగీత దర్శకుల కోసం ఇళయరాజా పాటలు పాడిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన ఇటీవల జరిగింది.
ఓ యువ సంగీత దర్శకుడు స్వరపరిచిన పాటను ఇళయరాజా ఆలపించారు. అయితే ఆ యువ సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడు యువన్ శంకర్ రాజానే కావటం విశేషం. ధనుష్ హీరోగా ఘనవిజయం సాధించిన మారికి సీక‍్వల్‌గా అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మారి 2’ కోసం ఇళయరాజా ఓ గీతాన్ని ఆలపించారు. ఇటీవల ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని హీరో ధనుష్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు.
So happy to announce that the maestro isaignani ilayaraja sir sang a song today for #maari2. What a delightful divine experience. We feel so blessed and super thrilled. @thisisysr @directormbalaji pic.twitter.com/6pNRj09aZ7
— Dhanush (@dhanushkraja) 16 January 2018
Comments
Please login to add a commentAdd a comment