
హాలీవుడ్‌లో... యువన్ స్వరాలు
తమిళ, తెలుగు భాషల్లో స్వరకర్తగా యువన్ శంకర్‌రాజాకు స్పెషల్ క్రేజ్ ఉంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వారసునిగా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన యువన్ చాలా త్వరగానే తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. త్వరలో యువన్ ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రభాకరన్ హరిహరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం పేరు ‘ఊల్‌ఫెల్’. ఇవన్ డ్రాగో అనే రోబో ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు యువన్ మంచి నేపథ్య సంగీతం అందించారు. నవంబర్ ప్రథమార్ధంలో ఈ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది సన్‌డాన్స్ చలన చిత్రోత్సవాల్లో సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు ప్రభాకరన్ తెలిపారు.