కరోనా వైరస్‌ గురించి అతనికి ముందే తెలుసా? | Did Contagion Movie predicted an outbreak like Coronavirus | Sakshi
Sakshi News home page

ఇప్పుడు జరుగుతుంది 2011లోనే ఎలా తెలిసింది?

Published Sun, Mar 15 2020 7:52 PM | Last Updated on Sun, Mar 15 2020 8:31 PM

Did Contagion Movie predicted an outbreak like Coronavirus - Sakshi

కరోనా వైరస్‌ ... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు ఇది. 135 దేశాలకుపైగా వ్యాపించిన ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మరిగా ప్రకటించింది. అనేక దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో తాజాగా హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘కంటాజియన్‌ చిత్రం మళ్లీ వైరల్‌ అవుతోంది. ఇప్పుడంతా ఆ సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకుని మరీ చూస్తున్నారు. ఈ సినిమాలో కూడా చైనా నుంచి ఓ అంటువ్యాధి ప్రబలి... అన్ని దేశాలకు విస్తరిస్తుంది. దీంతో  ఆ డైరెక్టర్‌కు ముందే ఈ వైరస్‌ గురించి ఎలా తెలుసు అనే చర్చ జరుగుతోంది. ఇది యాదృశ్చికమా? లేక ముందుగానే ఆ దర్శకుడికి ఈ అంటువ్యాధి గురించి తెలుసా? అని సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు ఆ సినిమాలు ఈ వైరస్‌ గురించి ఏం చెప్పారో ఒకసారి పరిశీలిద్దాం.

2011లో స్టీవెన్‌ సోడెన్‌ బర్గ్‌ దర్శకత్వలో మాట్‌ డామన్‌, జూడ్‌లా, గ్వినేత్‌ పాల్ట్రో నటించిన హాలీవుడ్‌ చిత్రం కంటాజియన్‌ ( అంటువ్యాధి). ఈ సినిమాలో కూడా చైనాలోని హుబెయ్‌ ఫ్రావిన్స్‌లో కరోనా లాంటి ఒక కొత్త వైరస్‌ పుట్టినట్టు ఒక  వైరస్‌ పుడుతుంది. ఈ వైరస్‌ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్వోతూ ఉంటారు. ఈ వైరస్‌ కూడా ఒకరి నుంచి మరొకరికి దగ్గు తుంపరులు ద్వారా, తాకిడి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అయితే ఈ వైరస్‌ మూల కారణం ఏంటో శాస్త్ర్రవేత్తలకు కూడా అంతు చిక్కదు.  అయితే ఈ సినిమా చివరిలో వైరస్‌ వ్యాప్తికి గబ్బిలాలు కారణమని తెలుస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్‌కు కూడా అవే లక్షణాలు ఉండటం. కరోనా కూడా ఆ సినిమాలో చూపించిన విధంగా వ్యాప్తి చెందుతుండటంలో ఈ సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement