హాలీవుడ్లో యువన్ సంగీతం | music director yuvan shankar raja goes to hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్లో యువన్ సంగీతం

Published Thu, Oct 29 2015 12:33 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

హాలీవుడ్లో యువన్ సంగీతం

హాలీవుడ్లో యువన్ సంగీతం

సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువన్ శంకర్ రాజా హాలీవుడ్లో తన స్వరాలను వినిపించనున్నాడు. భారతీయ దర్శకుడు హరిహరన్ తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ చిత్రం 'వూల్ఫెల్' సినిమా ద్వారా హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు ఈ యువ సంగీత తరంగం.

యానిమేషన్ సినిమాగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా 'వూల్ఫెల్'కు సంగీతం అందిస్తున్నట్టు తన ట్విట్టర్లో ప్రకటించాడు యువన్. దర్శకుడు హరిహరన్తో పాటు డిజైనర్ కునాల్ రాజన్తో కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో పాటలు ఉండవని, నేపథ్య సంగీతంతో పాటు ఓ ప్రమోషనల్ సాంగ్ను మాత్రమే అందిస్తున్నట్టుగా తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement