woolfell
-
హాలీవుడ్లో... యువన్ స్వరాలు
తమిళ, తెలుగు భాషల్లో స్వరకర్తగా యువన్ శంకర్‌రాజాకు స్పెషల్ క్రేజ్ ఉంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వారసునిగా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన యువన్ చాలా త్వరగానే తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. త్వరలో యువన్ ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రభాకరన్ హరిహరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం పేరు ‘ఊల్ఫెల్’. ఇవన్ డ్రాగో అనే రోబో ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు యువన్ మంచి నేపథ్య సంగీతం అందించారు. నవంబర్ ప్రథమార్ధంలో ఈ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది సన్డాన్స్ చలన చిత్రోత్సవాల్లో సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు ప్రభాకరన్ తెలిపారు. -
హాలీవుడ్లో యువన్ సంగీతం
సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువన్ శంకర్ రాజా హాలీవుడ్లో తన స్వరాలను వినిపించనున్నాడు. భారతీయ దర్శకుడు హరిహరన్ తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ చిత్రం 'వూల్ఫెల్' సినిమా ద్వారా హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు ఈ యువ సంగీత తరంగం. యానిమేషన్ సినిమాగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా 'వూల్ఫెల్'కు సంగీతం అందిస్తున్నట్టు తన ట్విట్టర్లో ప్రకటించాడు యువన్. దర్శకుడు హరిహరన్‌తో పాటు డిజైనర్ కునాల్ రాజన్‌తో కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో పాటలు ఉండవని, నేపథ్య సంగీతంతో పాటు ఓ ప్రమోషనల్ సాంగ్‌ను మాత్రమే అందిస్తున్నట్టుగా తెలిపాడు. Hi guys I'm really excited to be associated with the team @dhivyadivz @iamspydii @woolfellmovie IT'S TIME TO ROCK 😎😎😎 — Yuvanshankar raja (@thisisysr) October 27, 2015