మెగాస్టార్‌ మెచ్చిన ‘ప్యార్‌ ప్రేమ కాదల్’ | Megastar Chiranjeevi All Praise For Pyaar Prema Kaadhal | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 3:30 PM | Last Updated on Tue, Sep 18 2018 3:33 PM

Megastar Chiranjeevi All Praise For Pyaar Prema Kaadhal - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు  యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం ‘ప్యార్ ప్రేమ  కాదల్’. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శక‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ  సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప‌తాకంపై యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ స్వయంగా సంగీతం అందించారు.

త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -‘టీజ‌ర్ లాంచ్‌కి అంగీక‌రించ‌డానికి కార‌ణం . భ‌ర‌ద్వాజ‌, విజ‌య్‌, యువ‌న్‌లే. త‌మ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జ‌న‌రేష‌న్ గ్యాప్ ఉన్నా యువ‌న్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవ‌రెట్ సంగీత ద‌ర్శకుడు అత‌డు. 80ల‌లో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వడం వ‌ల్లనే త‌నంటే ఇంత ఇష్టం. త‌ను ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ నిర్మాత‌గా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ న‌చ్చడం వ‌ల్లనే అని అనుకుంటున్నా. ఇది హిట్టేన‌ని భావిస్తున్నా’ అన్నారు.

చిత్ర  స‌మ‌ర్పకుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ...‘యువ‌న్ శంక‌ర్ రాజా తొలి సారి నిర్మాత‌గా రూపొందించిన ప్యార్ ప్రేమ కాద‌ల్ చిత్రాన్ని బాగా న‌చ్చి రిలీజ్ చేస్తున్నాం. యంగ్ టీమ్ అద్భుతంగా చేశారు’ అని తెలిపారు. నిర్మాత యువ‌న్ శంక‌ర్ రాజా మాట్లాడుతూ - ‘మెగాస్టార్ ఆశీస్సుల‌తో ఈ సినిమా రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది. నిర్మాత‌గా తొలి ప్రయ‌త్నం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. అంద‌రి ఆద‌ర‌ణ కావాలి’ అన్నారు. మరో నిర్మాత విజ‌య్ మోర్వనేని మాట్లాడుతూ - ‘త‌మిళ్‌లోలానే తెలుగులోనూ విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మకం ఉంది. చ‌క్కని కంటెంట్ ఉన్న సినిమా ఇది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement