
ప్రేమ కథలతో తెరకెక్కిన సినిమాలు చాలావరకు ఘనవిజయం సాధించాయి. అందుకే ప్రేమకథ సినిమాతో నిర్మాతగా మారబోతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా. ’ప్యార్ ప్రేమ కాదల్’ సినిమాతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కె.ప్రొడక్షన్స్ అధినేత ఎస్.ఎన్.రాజరాజన్‌తో కలిసి ఆయన తన వైఎస్‌ఆర్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకుముందు బాహుబలి-2 చిత్రాన్ని తమిళనాట విడుదల చేశారు. బిగ్‌బాస్ షోతో ఫేమ్ అయిన హరీశ్ కల్యాణ్, రైసా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు యువన్‌శంకర్‌రాజా సంగీతం, రాజాభట్టాచార్య ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా ఇళన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందు పలు షార్ట్‌ఫిల్స్మ్ రూపొందించారు. ఒక మంచి ప్రేమ కథ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని, ఇన్నాళ్లకు ఈ కథ లభించిందని యువన్ శంకర్ రాజా చెప్పారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.