
తమిళసినిమా: నటుడు విజయ్‌సేతుపతితో అంజలి జత కడుతున్న తాజా చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాహుబలి–2 చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన కే.ప్రొడక్షన్స్ ఎస్‌ఎన్.రాజరాజా, వైఎస్‌ఆర్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరి కలయికలో ఇప్పటికే ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం నిర్మాణంలో ఉంది. తాజాగా విజయ్‌సేతుపతి, అంజలి జంటగా నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా పణ్ణైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌యూ.అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా లింగా నటిస్తుండగా ఒక ముఖ్య పాత్రలో వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. ఇతర తారాగణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు వెల్లడించారు.
యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, విజయ్‌కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ను తెన్‌కాశి, మలేషియాలో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన భారీ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు ఎస్‌యూ.అరుణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment