తమిళ అబ్బాయితోనే పెళ్లి అంటోన్న హీరోయిన్‌ | Anjali About Her Marriage And Would Be | Sakshi
Sakshi News home page

తమిళ అబ్బాయితోనే పెళ్లి

Published Tue, Jun 25 2019 9:35 AM | Last Updated on Tue, Jun 25 2019 9:35 AM

Anjali About Her Marriage And Would Be - Sakshi

తమిళసినిమా: తమిళ అబ్బాయితోనే తన పెళ్లి అంటోంది నటి అంజలి. ఈ పదహారణాల తెలుగమ్మాయి నటిగా తొలుత జయించింది తమిళ సినిమాలోనే అన్నది తెలిసిందే. తెలుగులోనూ  అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. గతంలో చెన్నైలో నివసించిన ఈ అమ్మడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో బిజీగా ఉండటంతో అటూ, ఇటూ చెక్కర్లు కొడుతోంది. అయితే తమిళంలోనే అధిక చిత్రాలు చేతిలో ఉండటం విశేషం. ఈ బ్యూటీ విజయ్‌సేతుపతితో జత కట్టిన ‘సింధుబాద్‌’ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా అంజలి ఓ భేటీలో పేర్కొంటూ.. సినిమాలో విజయ్‌సేతుపతి కొంచెం చెవుడు కలిగిన పాత్ర అని, అయనకు గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుందని చెప్పింది. తాను గ్రామంలో నివశించే సాధారణ యువతిగా నటించానని, కట్టు, బొట్టు అంతా సహజంగా ఉంటాయని చెప్పింది. పాటల్లో మాత్రం కాస్త గ్లామర్‌గా కనిపిస్తానని అంది.  దెయ్యాలున్నాయని నమ్ముతారా? అని అడుగుతున్నారని, ఇంట్లో తన తల్లి తనను దెయ్యం అని అంటుందని అంది. ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు తాము బస చేసిన ప్రాంతంలో దెయ్యం ఉందని చెప్పారని అంది. దెయ్యం ఉండవచ్చని పేర్కొంది. ఇకపోతే హీరోల్లో ఎవరైనా మీకు ఐలవ్యూ చెప్పారా? అని ప్రశ్నకు లేదని బుదులిచ్చింది. తాను నటించిన హీరోలలో ఎక్కువ మందికి పెళ్లిళ్లు అయ్యాయని చెప్పింది. నటుడు జైకే ఇంకా పెళ్లి కాలేదని, తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తనకు తెలియదని పేర్కొంది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిందనే గతంలో ప్రచారం సాగింది. తాను పెళ్లి చేసుకుంటే తమిళ అబ్బాయినే చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. అయితే తమిళ సినిమాల్లో నటిస్తున్నా హైదరాబాద్‌లోనే నివశిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, హింది భాషల్లో తెరకెక్కుతున్న సైలెన్స్‌ చిత్రంలో మాధవన్, అనుష్కలతో కలిసి నటిస్తున్నట్లు తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement