విజయ్‌ సినిమాకే ఇలాంటి సమస్యలు వస్తాయా..? | Vijay The Greatest of All Time Movie Struggles Again | Sakshi
Sakshi News home page

విజయ్‌ సినిమాకు మళ్లీ మొదలైన సమస్యలు

Published Wed, Apr 17 2024 3:52 PM | Last Updated on Wed, Apr 17 2024 3:59 PM

Vijay The Greatest of All Time Movie Struggles Again - Sakshi

నటుడు విజయ్‌ నటించిన చిత్రాలకు విడుదల సమయంలో సమస్యలు రావడం చాలా కాలంగా జరుగుతోంది. అలా ఈయన నటించిన తలైవా, కత్తి వంటి చిత్రాలు అసలు తెరపైకి వస్తాయా? అన్నంతగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇటీవల విడుదలైన లియో చిత్రంలోని నా రెడీయా మరవా అనే పాటపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అలాంటి సమస్య విజయ్‌ చిత్రాలకు ఇప్పటికీ వదలా బొమ్మాళీ అంటునే ఉంది. విజయ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం గోట్‌ ( ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైం). వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

నటుడు ప్రభుదేవా, ప్రశాంత్‌, మైక్‌మోహన్‌, అజ్మల్‌, యోగిబాబు, నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని సెప్టెంబర్‌ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవలే అధికారికంగా వెల్లడించారు. కాగా తాజాగా చిత్రంలోని విజిల్‌ పోడు అనే పల్లవితో సాగే పాటను విడుదల చేశారు. నటుడు విజయ్‌ పాడిన ఈ పాటలో ఆయనతో పాటు ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ తదితరులు నటించారు.

అసలు విషయం ఏమిటంటే ఈ పాట మద్యం తాగడం, పొగ తాగాడం వంటి అలవాట్లను ప్రోత్సహించేలా ఉందంటూ ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా చైన్నె డీఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై డీఐజీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో? అనే చర్చ జరుగుతోంది. మరోపక్క నటుడు విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో పాటు పార్టీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement