నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్
చెన్నై : నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారని నటుడు, సమత్తువ కచ్చి నేత, శాసనసభ్యుడు శరత్‌కుమార్ ఆరోపించారు. దీని గురించి ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రెండు రోజు క్రితం తన పేరుతో ఎవరో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారన్నారు. ఇది తనకు దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వారెవరైనా సరే వెంటనే తొలగించాలన్నారు. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అదే విధంగా తాను నిత్యం రెండు గంటలు ఎక్సర్‌సైజ్ చేస్తానని తెలిపారు.
శరీరం దృఢంగా ఉంటేనే మనసు, చర్యలు బాగుంటాయని పేర్కొన్నారు. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు బానిసవ్వకూడదని అందరికి హితవు చెబుతుంటానని అలాంటిది వృత్తిపరమైన, చిత్రం నుంచి తొలగించిన ఒక ఫొటోను సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రసారం చేస్తూ తనకు కళంకం ఆపాదించే చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇకపై తన ఫొటో గానీ, తనకు సంబందించిన న్యూస్‌ను గానీ ఏ సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రసారం చేయరాదని మనవి చేస్తున్నానని శరత్‌కుమార్ పేర్కొన్నారు.