శరత్‌కుమార్‌ నోరు అదుపులో పెట్టుకో | Rajinikanth fans against to sarathkumar | Sakshi
Sakshi News home page

శరత్‌కుమార్‌ నోరు అదుపులో పెట్టుకో

Published Tue, Jan 17 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

శరత్‌కుమార్‌ నోరు అదుపులో పెట్టుకో

శరత్‌కుమార్‌ నోరు అదుపులో పెట్టుకో

తమిళసినిమా: శరత్‌కుమార్‌ నోరు అదుపులో పెట్టుకో? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? రజనీకాంత్‌ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అని రజనీకాంత్‌ అభిమానులు హెచ్చరించారు. రజనీకాంత్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో జయలలిత మరణానంతరం తమిళనాడులో ఆసాధారణ పరిస్థితి నెలకొంది అన్న వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సమత్తువ మక్కళ్‌ కచ్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌ స్పందిస్తూ రజనీకాంత్‌ రాజకీయాల్లోకొస్తే ఆయన్ని ఎదుర్కొనే మొదటి వ్యక్తిని తానే అవుతానని అన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఇక రజనీ అభిమానులైతే శరత్‌కుమార్‌పై విరుచుకుపడుతున్నారు. సోమవారం ఉదయం రజనీ అభిమానులు స్థానిక నందంబాక్కం ట్రేడ్‌ సెంటర్‌ వద్ద శరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

రజనీకాంత్‌ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ స్థాయి ఏమిటో గుర్తెరిగి ప్రవర్తించు. నోరు అదుపులో పెట్టుకో. రజనీకాంత్‌ రాజకీయాల్లోకొస్తే నీ పార్టీ మట్టికొట్టుకుపోతుంది లాంటి హెచ్చరికలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ విషయం తెలుసుకున్న నందంబాక్కం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రజనీ అభిమానులను శాంతపరచి అక్కడనుంచి పంపివేశారు. కాగా చెన్నైలోని వడపళని వంటి ప్రాంతాల్లో శరత్‌కుమార్‌ అభిమానులు రజనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని పరిస్థితులను చక్కదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement