ఓటీటీలోకి శరత్‌కుమార్‌ ఎంట్రీ, నిర్మాతగా రాధిక | Sarathkumar Foray Into OTT | Sakshi
Sakshi News home page

Sarathkumar: ఓటీటీలోకి శరత్‌కుమార్‌ ఎంట్రీ

Published Thu, Jul 8 2021 7:41 AM | Last Updated on Thu, Jul 8 2021 8:08 AM

Sarathkumar Foray Into OTT - Sakshi

నటుడు శరత్‌కుమార్‌ ఓటీటీ ఎంట్రీ షురూ అయింది. తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో కథానాయకుడిగా నటించి సుప్రీం హీరోగా పేరు గాంచిన నటుడు శరత్‌కుమార్‌ తాజాగా 'ఇరై' అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ అవుతున్నారు. ఈ సిరీస్‌ ఆయన సతీమణి, నటి రాధిక శరత్‌కుమార్‌ తన రాడాన్‌ సంస్థలో నిర్మిస్తున్నారు.

ఇంతకు ముందు తూంగావనం, కడారం, కొండాన్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజేస్‌ ఎం.సెల్వ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సిరీస్‌ గురించి నిర్మాత రాధిక శరత్‌కుమార్‌ మాట్లాడారు. ఇరై వెబ్‌ సిరీస్‌ ద్వారా తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రంగం ప్రవేశిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement