నేనలా అనలేదు | i won't join in any political party : namitha | Sakshi
Sakshi News home page

నేనలా అనలేదు

Published Wed, Jan 8 2014 3:52 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

నేనలా అనలేదు - Sakshi

నేనలా అనలేదు

నేను అలా అనలేదని, నా మాటలను వక్రీకరించారని అంటున్నారు భారీ అందాల భామ నమిత. నటిగా దక్షిణాదిన సంచలనం రేపిన ఈ బ్యూటీ ఇకపై రాజకీయాల్లో కలకలం పుట్టించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మే స్వయంగా ప్రకటించి రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించారు. త్వరలోనే తన రాజకీయ అరంగేట్రం ఉంటుందని వెల్లడించారు. అంతటితో ఆగకుండా నటుడు శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా? అని ప్రకటన ఇచ్చి వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే తాను అలా అనలేదని తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆమె ఇలా పేర్కొన్నారు. నేను ఇటీవల తిరుచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ సమయంలో పత్రికలవారు రాజకీయ రంగ ప్రవేశం గురించి  ప్రశ్నించారు.
 
అందుకు నేను రాజకీయాలపై ఆసక్తి ఉందని బదులిచ్చాను. ఏ పార్టీలో చేరబోతున్నారన్న ప్రశ్నకు ఈ నెలాఖరు వరకు వేచి చూడండి అని చెప్పాను. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విజయం సాధించడంపై స్పందన ఏంటి అని అడిగారు. ఆమ్‌ఆద్మీ అంటే సాధారణ ప్రజలు అని అర్థం. సాధారణ ప్రజలు రాజకీయాల్లోకి రావచ్చు అని నిరూపించారు. వారికి నా శుభాకాంక్షలు అన్నాను. అంతేగానీ నేను ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరుతానని అనలేదు. ఒక విలేకరి శరత్‌కుమార్‌తో కలుస్తారా? అని అడిగారు. అందుకు నేను మంచి విజయవంతమైన కూటమిలో చేరుతానన్నాను. నేనడిగింది రాజకీయ కూటమి గురించేనని స్పష్టం చేశారు.
 
అయితే నటుడు శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా? అంటూ నేను ప్రశ్నించి నట్లు నా మాటలను వక్రీకరించారు. నేను చిత్ర రంగం లో చాలా కాలంగా ఉంటున్నాను. శరత్‌కుమార్ నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంఘాన్ని ఒక కుటుంబంలాగా తీర్చిదిద్దారు. నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగానే ఉన్నాను. అలాంటిది శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా లేదా అనే విషయం కూడా తెలియకుండా ఉన్నానా? అంటూ నమిత ప్రశ్నించారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement