సరికొత్త సునామీ... సోషల్ మీడియా | social media is the weapon for publicity | Sakshi
Sakshi News home page

సరికొత్త సునామీ... సోషల్ మీడియా

Published Wed, Dec 18 2013 11:23 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

సరికొత్త సునామీ... సోషల్ మీడియా - Sakshi

సరికొత్త సునామీ... సోషల్ మీడియా

 విశ్లేషణ

పోతుకూరు శ్రీనివాసరావు
 
 సోషల్ మీడియా ఇపుడు రాజకీయ పార్టీలకు లభించిన సరికొత్త ఆయుధమనే చెప్పాలి. ప్రజలు దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో తెలుసుకునేందుకు ఇది మేలైన మార్గం.
 
 కులం, మతం, డబ్బు... మన దేశంలో ఎన్నికలకు ఇవి నిత్యావ సరాలుగా ఎపుడో మారిపోయా యి. ఏ అర్హతైనా ఆ తర్వాతే. పార్టీలే కాదు ప్రజలూ ఇలా ట్యూన్ అయిపోయారు. ఈ మధ్యే జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను శ్రద్ధ గా పరిశీలిస్తే ఈ పరిస్థితిలో కొంచెం మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో అచిరకాలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టించిన ప్రభంజనం ఇందుకు ప్రబల నిదర్శనం. ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బలం రాకపోయినప్పటికీ ప్రధాన పార్టీలను అది కంగు తినిపించిన తీరు గమనా ర్హమే. ఆమ్‌ఆద్మీ బృందం సాధించిన ఈ విజయానికి దోహదపడిన అనేక అంశాలలో సోషల్ మీడియా ఒకటి.
 
 సోషల్ మీడియా... కోట్లాదిమందిని కలిపి ఉంచుతు న్న ఓ బలమైన వేదిక... క్షణాల్లో అందరినీ ఒక్కచోట చేర్చ గలిగే, క్షణంలో మన అభిమతాన్ని అందరికీ తెలపగలిగే అదృశ్యవాహిక. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, వెబ్‌టీవీ... ఇలా ఏదో ఒకదానికి యూత్ నిరంతరం కనెక్ట్ అయి ఉంటున్నారు. అరచేతిలో ఇమిడి పోయే సెల్‌ఫోన్‌లో ప్రపంచాన్ని పట్టి ఉంచుతున్నారు. భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తున్నారు. అందుకే రాజకీయ పార్టీలన్నీ యూత్‌పై దృష్టిపెట్టాయి. అంటే సోషల్ మీడి యాపై కన్నేశాయి.
 
 ఢిల్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించడానికి ప్రధా న రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్ పోస్టులు, ట్విట్టర్ ఛాటింగ్ నుంచి లైవ్‌టీవీ చాట్ వరకు అన్ని రకాల ప్రయత్నాలూ చేశాయి. ఆమ్ ఆద్మీ, బీజేపీలతోపాటు కపిల్‌సిబల్ నేతృ త్వంలోని కాంగ్రెస్ పార్టీ సైబర్‌టీమ్ కూడా గట్టిగానే ప్రయత్నించింది. కానీ గ్రామీణ ఢిల్లీలో బీజేపీ గణనీ యమైన ఓట్లు సీట్లు సాధించగా అర్బన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విజయబావుటా ఎగురవేసింది.
 
 జనలోక్‌పాల్ ఉద్యమంలోనే
 {పతి ఒక్కరూ ఓటు వేయడం ఎంత ముఖ్యమో చెబుతూ ప్రచారం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా నమోదు చేయించుకున్న ఓటర్లను తమకు అనుకూలంగా మోటి వేట్ చేయడంలోనూ సత్ఫలితం సాధించింది. ఓటర్లను ఆకర్షించడానికి టెక్ట్స్-వాయిస్ మెస్సేజ్‌లు, మొబైల్ ఇంట ర్నెట్ వంటివి ఆమ్ ఆద్మీకి ఎంతగానో ఉపకరించాయి. జన్‌లోక్‌పాల్ ఉద్యమం జరుగుతున్నపుడే ఆ ఉద్యమానికి ప్రాచుర్యం తీసుకురావడం కోసం కేజ్రీవాల్ బృందం ‘ఇండియా అగెనైస్ట్ కరప్షన్’ వెబ్ పేజీని ప్రారంభించింది. ఇందులో స్పెషల్ కాలింగ్ కార్డ్స్, ఆండ్రాయిడ్ - సింబి యాన్ యాప్స్, ట్విట్టర్ ఇంటరాక్షన్ వంటి వాటిని విరి విగా ఉపయోగించారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమం దేశం మూలమూలలకు చేరుకోవడానికి ఇవి ఎంతగానో దోహద పడ్డాయి. అంతేకాదు ఢిల్లీ ఎన్నికలకు అవి రిహార్సల్స్‌లా కూడా ఉపకరించాయి.
 
 వినూత్న ఆలోచనల ఆమ్ ఆద్మీ
 సోషల్‌మీడియాలో ఉన్న ఏ అవకాశాన్నీ ఆమ్ ఆద్మీ బృం దం విడిచిపెట్టలేదు. అది ప్రయోగించిన కొన్ని వినూత్న మైన ఆలోచనలివీ...
 వోటరైట్: తొలిసారిగా ఓటుహక్కు సాధించుకోవడానికి ఈ వెబ్‌సైట్ యూత్‌కు ఎంతగానో సహకరించింది. అలా ఓటు హక్కు సంపాదించిన యువ వోటర్లంతా ఈ వెబ్‌సైట్‌లో కనెక్టయ్యారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ తొలి వోటర్లు మంచి ప్రచారకార్యకర్తలుగా మారిపో యారు. తమ తమ సొంత సర్కిల్స్‌లో, ఫ్రెండ్స్‌లో వీరు చేసిన ప్రచారం ఆమ్‌ఆద్మీ పార్టీకి చాలా ఉపయోగపడింది.
 
 కాల్ ఢిల్లీ: ఎన్నికల ప్రచారం అధికారికంగా ముగిసి పోయి న తర్వాత కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విస్తృతమైన ప్రచారం కల్పించిన వినూత్నమైన ఆలోచన ఇది. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో పార్టీ ముఖ్య నాయకుల ప్రసంగా లను అందుబాటులో ఉంచారు. వాటిని ఆమ్ ఆద్మీ కార్య కర్తలు తమ స్నేహితులకు, తెలిసిన వారికి ప్రతిరోజూ ఫార్వార్డ్ చేస్తుండేవారు. ఇవే కాక ఆమ్ ఆద్మీ ఫాంఫ్లేట్ లను కూడా ఈ వెబ్‌సైట్ నుంచి భారీగా బట్వాడా చేశారు.
 
 థండర్‌క్లాప్: ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఏదైనా ఒక పోస్ట్ గురించి నిర్ణీత సంఖ్యను దాటి జనం చర్చించుకుంటుంటే అది థండర్ క్లాప్ కేటగిరీ కిందకు వస్తుంది. దాంతో ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ ఆ పోస్ట్‌ను మరింత మందికి చేరవే స్తాయి. దాంతో అందరి దృష్టి దానిపై మళ్లుతుంది. ‘ఆమ్ ఆద్మీకి ఓటేయండి’ అనే పోస్ట్‌ను ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా భారీగా ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి 35 లక్షల మంది మద్దతు పలికారు.
 
 రోబో కాలింగ్: ఎంపిక చేసిన ఫోన్ నెంబర్లకు ఇంటర్నెట్ ద్వారా ఆటో డయలింగ్ ప్రోగ్రామ్‌ను అనుసంధానం చేస్తా రు. ముందుగా ఫీడ్ చేసిన టెక్ట్స్ మెస్సేజ్ లేదా వాయిస్ మెస్సేజ్ ఆయా నంబర్లకు చేరుతుంది. రోబో కాలింగ్ విధానాన్ని మొట్టమొదటగా 2006లో అమెరికా ఎన్నికల లో ఉపయోగించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యూహకర్తలు ‘రో బోకాలింగ్’ ఆలోచనను కూడా చక్కగా ఉపయోగించుకు న్నారు. కేజ్రీవాల్ వాయిస్ మెస్సేజ్‌ను లక్షలాది మందికి పంపించారు. ఓటర్లతో కేజ్రీవాల్ స్వయంగా మాట్లాడుతు న్నట్లు రూపొందించిన కార్యక్రమమిది. మంచి పరిపాలన అందిస్తామని, ఒక్క అవకాశమివ్వాలని కేజ్రీవాల్ అభ్య ర్థించడం ఓటర్లపై చాలా ప్రభావం చూపించింది.
 
 బీజేపీ స్పెషల్ సెల్...
 సోషల్ మీడియాను ఉపయోగించుకునేందుకు బీజేపీ కూడా తీవ్రంగా శ్రమించింది. ముఖ్యంగా ఢిల్లీలో అది కేంద్రీకరించి పనిచేసింది. సోషల్ మీడియా కోసం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా 25 మంది నిపుణులతో ఒక సెల్‌ను ఏర్పాటు చేసింది. సోషల్‌మీడియా సైట్లలో పార్టీ అభ్యర్థుల ప్రచారానికి తగిన సహాయ సహకారాలను ఈ సెల్ అందించింది. పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడికి ఆన్‌లైన్‌లో ఉన్న అపారమైన మద్దతు బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి విశేషంగా తోడ్పడింది. సోషల్ మీడియా సెల్‌కు మోడి ఎప్పటికప్పుడు సూచనలు అందించేవారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ట్విట్టర్ చాటింగ్‌లు, ఫేస్‌బుక్ పేజీలపైనే ఎక్కువగా ఆధారపడడం బీజేపీకి అంతగా లాభించలేదని చెప్పాలి.
 
 వచ్చే ఎన్నికల్లో కీలకం...
 వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించే అవకాశముందని విశ్లేషకు లంటున్నారు. ఇదే అంశాన్ని పలు నివేదికలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ‘సోషల్ మీడియా ఇన్ ఇండియా -2013’ పేరుతో ‘ఇంటర్నెట్- మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఓ నివేదికను విడు దల చేసింది. 2013 జూన్-డిసెంబర్ మధ్య భారత దేశంలో సోషల్ మీడియా యూజర్లు 19 శాతం పెరగబో తున్నారని ఆ నివేదిక అంచనా వేసింది. పట్టణ ప్రాం తాలలోని దాదాపు 20 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుంటు న్నారని అది పేర్కొంది. గత ఎన్నికలలో పోలింగ్ వివ రాలను, ఓటర్ల గణాంకాలను, కొత్త ఓటర్లలో నెటిజన్ల శాతం మొదలైనవాటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత 2014 ఎన్నికల్లో పోలింగ్ 3 నుంచి 4 శాతం పెరగ బోతు న్నదని కూడా ఈ నివేదిక అంచనా వేసింది. ఇలా కొత్తగా ఓటు వేయబోతున్న వారిలో అధికభాగం సోషల్ మీడి యాతో కనెక్ట్ అయినవారేనని ఆ నివేదిక పేర్కొంది.
 
 అభిప్రాయాలను మార్చగలదు...
 ఎన్నికలలో రాజకీయ పార్టీల విజయావకాశాలపై సోషల్ మీడియా ప్రభావం ఉంటుందని నాలుగు రాష్ట్రాల ఎన్ని కలు రుజువుచేశాయి. పార్టీలు, అభ్యర్థులపై ఓటర్ల అభిప్రా యాలను సోషల్ మీడియా ప్రభావితం చేయగలదన్నది ఆ రంగంలోని నిపుణుల అభిప్రాయం. మన దేశంలో ప్రము ఖ పత్రికల సర్క్యులేషన్‌కన్నా ఆయా పత్రికలను ఫేస్ బుక్‌లో లైక్ చేస్తున్న వారి సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని 20:20 ఎంఎస్‌ఎల్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ చేతన్ మహాజన్ తెలిపారు. గ్రామీణ ఓటర్లపై సోషల్‌మీడియా ప్రభావం చాలా పరి మితమే... కానీ పట్టణాలలో మాత్రం వచ్చే ఎన్నికలలో సోషల్ మీడియా కీలకమైన పాత్ర పోషిం చబోతున్నదని జెర్మిన్ 8 సంస్థ సీఈఓ డాక్టర్ రంజిత్ నాయర్ పేర్కొ న్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లు ఓటు ఓయాలని నిర్ణయించుకోవడానికి, ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడానికి సోషల్ మీడియా సహక రిస్తుందని రంజిత్ వ్యాఖ్యానించారు.
 
 
 పార్టీల కొత్త ఆయుధం...
 సోషల్ మీడియా ఇపుడు రాజకీయ పార్టీలకు లభించిన సరికొత్త ఆయుధమనే చెప్పాలి. ప్రజలు దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారో, దేని గురించి ఎక్కు వగా ఆలోచిస్తున్నారో తెలుసుకునేందుకు ఇది మేలైన మార్గం. వాటికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి, తగిన ప్రణాళికలు తయారు చేసుకోవడానికి సోషల్ మీడియా ఉపకరిస్తుంది. ఆన్‌లైన్ లో పరుషపదజాలంతో దూషణభూషణల వల్ల ఆయా వ్యక్తులకే కాక వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలపై కూడా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని ప్రముఖ డిజిటల్ స్ట్రాటజిస్ట్ యూయూ దిన్ వ్యాఖ్యానించారు. అందుకే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో రాజకీయ పార్టీల తరఫున స్పందించేవారు క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక చర్చలకు మాత్రమే పరిమిత మైతేనే ఆమ్ ఆద్మీలా ఆశించిన ఫలితాలు వస్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement