Niharika Konidela's First Reaction After Divorce - Sakshi
Sakshi News home page

Niharika: విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్ ఇదే!

Jul 5 2023 8:39 AM | Updated on Jul 5 2023 10:08 AM

Niharika Konidela First Reaction On Divorce - Sakshi

సినిమా రంగంలోని సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి అయితే చెప్పనవసరం ఉండదు. తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడంతో ప్రతి విషయం ఇప్పుడు వైరల్‌ అవుతూనే ఉంది. నిహారిక-చైతన్యల పెళ్లి 2020 డిసెంబర్ 9న గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. తాజాగా వారిద్దరి అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు.

(ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్‌ వేసిన అడ్వకేట్‌ ఎవరంటూ..)

పెళ్లి తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతకు ముందు అడపాదడపా సినిమాలు చేసిన నిహారిక, పెళ్లి తర్వాత నిర్మాతగా మారింది. ఈ మధ్యే సొంత బ్యానర్‌ ‘పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌’ పేరు మీద హైదరాబాద్‌లో ఆఫీస్‌ ఓపెన్‌ చేసింది. అలా చైతన్యకు దూరంగా ఉన్నా తను ఏదో ఒక సినిమా పనిలో బిజీగానే ఉండేది.

(ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి 'నీల్‌' అని పేరు పెట్టాం: కాజల్‌)

అయితే నిహారిక విడాకుల విషయం మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత.. తను ఏమైనా నోరు విప్పుతుందా? అని  అందరూ భావించారు. కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్‌ అయిన కొద్దిసేపటికి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకరికి పుట్టిన రోజు విషెస్ చెబుతూ స్టోరీ షేర్ చేసింది. నిహారిక సినిమాలకు అమెరికా నుంచి ప్రమోషన్స్‌ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆమె బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ విడాకుల వార్తల గురించి పలు రకాలుగా వార్తలు వస్తున్నా.. ఆమె  స్పందించకపోవడంతో వీటిన లైట్ తీసుకున్నారని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement