Niharika-Chaitanya Divorce: Niharika Konidela Request To Netizens Over Dont Spread Negativity - Sakshi
Sakshi News home page

Niharika Konidela Divorce: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక

Published Wed, Jul 5 2023 11:48 AM | Last Updated on Wed, Jul 5 2023 12:41 PM

Niharika Konidela Reaction Of Netizens - Sakshi

ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది.  అయితే వీరి విడాకుల అంశంపై పలువురు నుంచి నెగటివ్‌ కామెంట్లు వస్తుండటంతో అఫిషియల్‌గా నిహారిక స్పందించింది.

(ఇదీ చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!)

'విడాకుల విషయంలో మేమిద్దరం పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. తామిద్ద‌రం కొత్త‌గా ప్రారంభించే వ్య‌క్తిగ‌త జీవితంలో ప్రైవ‌సీని కోరుకుంటున్నాం.  ఇంతటి ఇబ్బంది సమయంలో నా వెంట ఫ్యామిలీ, స్నేహితులు పిల్లర్స్‌లా నిలబడ్డారు. అందరినీ నేను రిక్వెస్ట్‌ చేస్తున్నాను.. మాపై నెగటివ్‌గా ప్రచారం చేయకండి. ఇలాంటి సమయంలో త‌మ‌ను దకయచేసి ఇబ్బంది పెట్ట‌కండి. ఇది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని తెలిపింది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement