Jonnalagadda Chaitanya Instagram Post Goes Viral After Divorce - Sakshi
Sakshi News home page

Jonnalagadda Chaitanya: నిహారికతో విడాకులు.. తొలిసారి ఇన్‌స్టాలో చైతన్య పోస్ట్!

Published Wed, Jul 26 2023 3:37 PM | Last Updated on Wed, Jul 26 2023 3:53 PM

Jonnalagadda Chaitanya Post Goes Viral After Divorce - Sakshi

ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు ఇటీవలే తమ వివాహ బంధానికి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.  విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని.. తమ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులను కోరారు. 

(ఇది చదవండి: బిగ్‌బాస్‌ 7లో బుల్లితెర నటి శోభా శెట్టి! ఎంట్రీ ఇస్తే..)

అయితే విడాకుల తర్వాత నిహారిక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఏదో ఒక పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది.  తన ఫ్రెండ్స్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటోంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత జొన్నలగడ్డ చైతన్య ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.  సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే చైతన్య ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తుంటారు.

తాజాగా జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. విడాకుల తర్వాత తొలిసారి తన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలతో పాటు 'ఆల్ త్రీస్ ఇన్‌ స్టైల్‌'  అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆ ఫోటోలను చూస్తే ప్రకృతిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలో పక్కనే సముద్రం, చెట్లు ఉండగా.. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చైతన్య కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం 'బిగినింగ్ న్యూ లైఫ్‌ బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

(ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement