టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఇది జరిగి పదిరోజులు దాటినా ఇప్పటికీ పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో వీరిద్దరి టాపిక్ నడుస్తూనే ఉంది. అంతే కాకుండా సోషల్‌మీడియాలో కూడా కామెంట్ల రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలయదు. వారి కుటుంబ సభ్యలు కూడా బహిరంగంగా ఎక్కడా మాట్లాడనూ లేదు. నిహారికతో పాటు చైతన్యపై కూడా పలువురు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద ఇలా చెప్పారని ప్రచారం జరగుతుంది.
(ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?)
'నేను ఉద్యోగరిత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను.. ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదు.. తన భర్త పై ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని చూసి సహించలేకపోతున్నాను' అని జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారట.
(ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..)
ఈ స్టేట్‌మెంట్‌లోని మాటలు ఆయన అన్నారో లేదో తెలియదు కానీ గత వారం నుంచి వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయని కొందరు నెటిజన్లు తెలుపుతున్నా మరికొందరు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదనే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా వారి వ్యక్తిగత జీవితం గురించి నెగటివ్‌గా మాట్లాడటం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment