
గుంటూరు నుంచి పోటీ చేస్తా: గల్లా
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....ఈ నెలాఖరున తన రాజకీయ నిర్ణయం ఉంటుందని జయదేవ్ తెలిపారు.
భవిష్యత్తులో జయదేవ్కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని గల్లా అరుణ కుమారి ఈ సందర్బంగా తెలిపారు. తమ కుటుంబ సభ్యులలో ఒకరు ఏలాంటి నిర్ణయం తీసుకున్న మిగతా అందరి మద్దతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే జయదేవ్ గల్లా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ఇటీవల కాలంలో ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.