jayadev galla
-
ఎంపీ గల్లా జయదేవ్ కనిపించడం లేదు
సాక్షి ప్రతినిధి గుంటూరు: గుంటూరు ప్రజల ఓట్లతో గెలుపొందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరులో మాత్రం కనిపించడం లేదంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శుక్రవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో తమ డివిజన్లలో పనులు జరగడం లేదంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రస్తావిస్తుండగా మేయర్ కావటి మనోహర్‌నాయుడు జోక్యం చేసుకుని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్లుగా తాము కూడా పారీ్టలకతీతంగా, కులాలు, ప్రాంతాలకతీతంగా నగరాభివృద్ధి చేపట్టామని, టీడీపీ వారు గెలిచిన డివిజన్లలో కూడా రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం గెలిచిన 38వ డివిజన్లో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా, ఎంపీ కేవలం పది లక్షల రూపాయలు ఇచ్చారని అనడంతో తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం సభ్యుడొకరు లేచి తాము నిధులు కావాలని అడుక్కుంటే ఇచ్చారని, మీరు కూడా వస్తే ఇస్తారంటూ వాదనకు దిగారు. దీనిపై అధికార పార్టీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ అందరిని సమానంగా చూడాలని, కేవలం మీ పార్టీ సభ్యులకే నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. తాము గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకూ ఎంపీని తాము చూడలేదని, ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసలు గుంటూరులో ఉండని వ్యక్తిని ఢిల్లీ వరకూ వెళ్లి నిధులు అడగాలా? అంటూ ప్రశ్నించారు. దీంతో మాటామాట పెరిగి తీవ్ర వాగి్వవాదానికి, తోపులాటకు దారితీసింది. టీడీపీ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లను సైతం తోసే ప్రయత్నం చేయడంతో ఎస్సీ మహిళ కార్పొరేటర్లు మల్లవరపు రమ్య, బూసి రాజలత టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీ గల్లాపై మిస్సింగ్ కేసు నమోదు చేయించాలని మేయర్‌ను కోరారు. అనంతరం మేయర్ కావటి మనోహర్‌నాయుడు జోక్యం చేసుకుని ఎంపీ గల్లా జయదేవ్ తనకు రూ.2.50 కోట్ల దాకా ఎంపీ ల్యాండ్స్ నిధులు వస్తే దానిలో కేవలం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా టీడీపీ వార్డు సభ్యులకు మాత్రమే మంజూరు చేశారని లెక్కలు చూపడంతో టీడీపీ నాయకులు మిన్నకుండిపోయారు. -
Galla Jayadev: ఎంపీ అన్న సంగతే మరిచిపోయారేమో..?
ఆయనో పెద్ద పారిశ్రామికవేత్త. గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వ్యాపార పనుల్లో ఎంపీ అన్న సంగతి మరిచిపోయారేమో..? రెండోసారి గెలిచాక.. ఈ మూడేళ్ళలో ఐదారు సార్లు కూడా నియోజకవర్గానికి రాలేదట. ప్రజలు తమ ఎంపీని చూడాలనుకుంటే టీవీల్లో మాత్రమే దర్శనమిస్తారు. ఆయనే గల్లా జయదేవ్. గుంటూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. కానీ గల్లా అంటే ఎంపీగా కంటే.. పారిశ్రామికవేత్తగానే అందరికీ గుర్తుంటారు. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా నియోజకవర్గానికి రావడం చాలా అరుదు. అసలు గుంటూరు ప్రజలను మీ ఎంపీ ఎవరని అడిగితే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు రెండు మూడు నెలలకు ఒకసారి అయినా గుంటూరుకు వచ్చి పోతుండేవారు. అది కూడా ఆయన సొంత పనులకోసం మాత్రమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలుపొందారు. గల్లా పోటీ చేసే సమయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లా గెలిస్తే టీవీలో చూసుకోవాల్సిందేనంటూ ప్రచారం చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. గల్లా జయదేవ్ గుంటూరును పూర్తిగా మర్చిపోయారు. గతంలోలా అప్పుడప్పుడు కూడా రావడంలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వచ్చినా కూడా ఎంపీ మాత్రం కనిపించడు. టీడీపీ తరపున ఏ కార్యక్రమం నిర్వహించినా గల్లా మాత్రం గైర్హాజరవుతారు. ఎంపీగా గెలిచి మూడేళ్లు అయినా ఐదారుసార్లు మాత్రమే గుంటూరు వచ్చారంటే ఆయనకు ప్రజలపట్ల ఎంత బాధ్యత ఉందో అర్దమవుతుంది. గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలైతే అసలు మనకు ఎంపీ ఉన్నాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. గల్లాను చూడాలంటే పార్లమెంట్ సమావేశాల్లో టీవీల్లో చూడడమే తప్ప ప్రత్యక్షంగా కనిపించరు. గల్లా తీరుపై తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తి అసంతృప్తి కనిపిస్తోంది. ఎంపీతో ఏదైనా పని పడితే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. గల్లా జయదేవ్‌ను కలవాలంటే ఎవరిని సంప్రదించాలో తెలియదు. గుంటూరులోని ఆయన ఆఫీసులో కూడా చిత్తూరు జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఉంటారు. వారిని అడిగితే ఎంపీ ఎప్పుడొస్తారో, ఇప్పుడెక్కడున్నారో తెలియదంటారు. ఎంతో కష్టపడి గల్లాను ఎంపీగా గెలిపించుకుంటే ఇప్పుడు తమ సమస్యలు వినడానికి కూడా అందుబాటులో లేకుండా పోయాడని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలైతే చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండడంతోనే తానేం చేసినా చెల్లుబాటు అవుతుందని గల్లా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వ్యాపారదృక్పధంతో మునిగి తేలే నాయకులను ఎంపీలుగా ఎన్నుకుంటే ఇలాగే ఉంటుందని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలకు చంద్రబాబు అపాయింట్మెంట్ అయినా దొరుకుతుందేమో కానీ గల్లా అపాయింట్మెంట్ దొరకడం కష్టమని సెటైర్లు వేస్తున్నారు. -
‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు చేసిన పొరపాట్లు పోటీ చేసిన అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి. కీలక స్థానాల్లో నిబంధనలు పాటించకపోవడంతో ఫలితాలు తారుమారై ఓటమి పాలయ్యారు. ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పోస్టల్, సర్వీస్ ఓట్లు చెల్లకుండా పోవడం అభ్యర్ధుల్ని ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన కొందరు అధికార పార్టీ సిట్టింగులు... ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి బయటపడ్డారు. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో పోస్టల్, సర్వీస్ ఓట్లు కీలకంగా మారాయి. మూడు లక్షల అయిదువేల పోస్టల్ బ్యాలెట్లు, అరవైవేల సర్వీస్ ఓట్లను జారీ చేశారు. వీటిలో 2లక్షల 20వేల ఓట్లు... పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం12 పూర్తి చేయడంలో చేసిన పొరపాట్లుతో చెల్లకుండాపోయాయి. కొన్ని చోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం కూడా వివాదాస్పదమైంది. అలాగే కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు ఆ బ్యాలెట్ పేపర్ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్ బ్యాలెట్ పంపే కవర్ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు ఓటమి బారి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. 6,653 ఓట్ల తేడాతో కింజారపు గెలిచారు. అలాగే గుంటూరు నుంచి గల్లా జయదేవ్ కూడా ఇలాగే సేఫ్ అయ్యారు. గుంటూరు పార్లమెంటు నియోజక వర్గంలోనూ భారీగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై 4205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్ గెలిచారు. పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. -
టీడీపీ మేనిఫెస్టోను అమలు చేస్తాం
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసేందుకు తమ నాయకుడు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే రైతుల రుణమాఫీపై సంతకం చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకువచ్చి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అమరరాజ కంపెనీ తరఫున 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తనను గెలిపించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడారు. సమావేశంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, నాయకులు కందుకూరి వీరయ్య, గల్లా పద్మ, రావిపాటి సాయికృష్ణ, వేమూరి సూర్యం, షేక్ లాల్‌వజీర్, యాగంటి దుర్గారావు, ఎలుకా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మహేష్ నాకు మద్దతిస్తాడు
హీరో మహేష్ బాబు ఏ పార్టీకి చెందిన వాడు కాదని, ఆయన ఎప్పుడూ ఎవరికీ ప్రచారం చేయలేదు గానీ, తనకు మాత్రం మద్దతిస్తాడని మహేష్ బావా గల్లా జయదేవ్ వెల్లడించారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు జయదేవ్ శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడారు. సీమాంధ్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని, అందుకే తాను టీడీపీలో చేరానని వెల్లడించారు. తాము కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నామని, అయితే రాష్ట్ర విభజనతో తమను ఆ పార్టీ నట్టేట ముంచిందని గల్లా అరుణ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కూడా ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుండటంతో కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని గతంలో గల్లా అరుణ భావించారు. ఆ క్రమంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె కుమారుడు జయదేవ్‌ను బరిలో దింపాలని యోచించారు. టీడీపీ అగ్రనేతలతో గల్లా కుటుంబసభ్యులు సంప్రదింపులు జరిపారు. అందుకు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు పచ్చ జెండా ఊపడంతో అరుణతోపాటు ఆమె కుమారుడు శనివారం టీడీపీలో చేరారు. -
గుంటూరు నుంచి పోటీ చేస్తా: గల్లా
-
గుంటూరు నుంచి పోటీ చేస్తా: గల్లా
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....ఈ నెలాఖరున తన రాజకీయ నిర్ణయం ఉంటుందని జయదేవ్ తెలిపారు. భవిష్యత్తులో జయదేవ్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని గల్లా అరుణ కుమారి ఈ సందర్బంగా తెలిపారు. తమ కుటుంబ సభ్యులలో ఒకరు ఏలాంటి నిర్ణయం తీసుకున్న మిగతా అందరి మద్దతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే జయదేవ్ గల్లా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ఇటీవల కాలంలో ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.