పేదల ఇళ్లపై గల్లా డేగ! | Galla poor grass and an eagle! | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లపై గల్లా డేగ!

Published Fri, Apr 11 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

పేదల ఇళ్లపై గల్లా డేగ!

పేదల ఇళ్లపై గల్లా డేగ!

  •       కూల్చిన ఇళ్ల మీదుగా ఫ్యాక్టరీకి దారి
  •      చుట్టుపక్కల పొలాలు,డీకేటీ భూముల ఆక్రమణ
  •      చస్తూ బతుకుతున్న లక్ష్మీపురం గ్రామస్తులు
  •  సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాపం పుణ్యం, మంచీ చెడ్డ మాజీ మంత్రికి పట్టవు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను అనుకున్నది జరగాల్సిందే. ఏ అధికారి అయినా, ఏ పేదవాడైనా తన మాటకు ఓకే అనాల్సిందే. పేదలకు బతుకునిస్తున్న డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములను ఆక్రమించడమో, నయానో భయానో స్వాధీనం చేసుకోవడమే కాదు.. పేదలు తలదాచుకునే ఇళ్లను సైతం కూలగొట్టించి తమ ఫ్యాక్టరీకి దారి వేసుకున్నారు.

    ఒక పక్క డబ్బు, మరోపక్క అధికార బలం  ఉన్న మాజీ మంత్రిని ఎదిరించలేక తొమ్మిది కుటుం బాలు ఊరొదిలి పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ జీవిస్తున్న వారు సైతం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గూండా లు తమ ఇళ్లు ఎప్పుడు కూల్చేస్తారోనని భయంతో కాలం గడుపుతున్నారు. ఇదంతా పూతలపట్టు మండలం లక్ష్మీపురంలో జరుగుతోంది.
     
    క్ష్మీపురం గ్రామంలోని 42 మంది పేదలకు  వైఎస్‌ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో కొందరు ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. గ్రామానికి సమీపంలో తమకు ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో లలితమ్మ, ఈశ్వరి, లక్ష్మి, జమున, గౌరమ్మ, చంద్రమ్మ, కాంతమ్మ, దేవమ్మ, జమున 2009-10లో ఇళ్లు నిర్మించుకున్నారు. లక్ష్మీపురానికి పక్కనే ఉన్న కొన్ని భూములను గల్లా అరుణకుమారి తమ గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీ కోసం అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. నయానో భయానో అక్కడున్న డీకేటీ భూములను సైతం స్వాధీనం చేసుకున్నారు.
     
    ఫ్యాక్టరీకి రోడ్డు మార్గం లేదా?
     
    ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ఏ వైపు నుంచి అయినా రోడ్డు వేసుకునే అవకాశం ఉంది. అయితే, కాలనీ మీదుగా రోడ్డు నిర్మిస్తే వారంతా దూరంగా వెళతారని, ఇక ఫ్యాక్టరీకి ఎటువంటి అడ్డంకులు ఉండవనేది గల్లా ఆలోచనగా తెలుస్తోంది. దీంతో గల్లా వర్గీయులు తొమ్మిది మంది పేదల ఇళ్లు కూల్చివేశారు. తరువాత లలితమ్మకు రూ.7లక్షలు, ఈశ్వరికి రూ. 2.5 లక్షలు, లక్ష్మికి లక్ష చొప్పున డబ్బు ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వలేదు. ఇక్కడున్న కొంతమంది వడ్డెర్ల గుడారాలను ఖాళీ చేయించారు. గూండాల భయంతో దొరస్వామి అనే వ్యక్తి ఇల్లు నిర్మించేందుకు వేసుకున్న పునాదులను వదిలి తిరుపతికి వెళ్లి పోయాడు. లలితమ్మ, ఈశ్వరి బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు.
     
    ప్రభుత్వ రోడ్డును ఆక్రమించారు
     
    చిత్తూరు- కడప జాతీయ రహదారి నుంచి గల్లాఫుడ్స్ ఫ్యాక్టరీ మీదుగా లక్ష్మీపురానికి రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది. 15 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును ఫ్యాక్టరీలోకి కలుపుకున్నారు. దీని పక్కన మరో 20 అడుగుల కొత్తరోడ్డు వేసేందుకు స్థలాన్ని ఆక్రమించారు. ఆ స్థలంలో కొత్తరోడ్డు వేస్తూ పాతరోడ్డును తవ్వేసే కార్యక్రమాన్ని 2011 మే 23 రాత్రి చేపట్టారు. దీనిని లక్ష్మీపురం గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేపట్టడంతో తాత్కాలికంగా కొత్తరోడ్డు నిర్మాణాన్ని ఆపివేశారు. తరువాత రోడ్డువేయడంపై స్థానికులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంజక్షన్ ఇచ్చింది. అయితే  పేదోళ్ల గుడిసెలు కూల్చిన ప్రాంతంలో మాత్రం రోడ్డు వేశారు.
     
    రైతుల భూములు స్వాహా...
     
    తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 299/1ఎలో 1.65 ఎకరాలు, 1బిలో 2.02 ఎకరాలు, 227/1ఎలో 32 సెంట్లు, 1బీలో 52 సెంట్లు, 2ఎ1లో 68సెంట్లు, 2ఎ2లో 68సెంట్లు, 2బిలో 1.3 ఎకరాలు, 2సీలో 3.74ఎకరాలు, 327/3లో 1.5 ఎకరాలు, 327/4లో 1.07 ఎకరాలు, 1240/1లో 4.75 ఎకరాలు, 1241లో 4.68 ఎకరాలు, 1246/1లో 4.09 ఎకరాలు, 1246/2డీలో 1.11 ఎకరాలు, 1246/2బీలో 0.6 ఎకరాలు, 1247/2ఐలో 0.94ఎకరాలు, 1247/2జేలో 1.45 ఎకరాలు, 2264లో 4.20 ఎకరాలు, 1238లో 2.01ఎకరాలు, 1239లో 4.24 ఎకరాలు, 1265/2లో 1.16 ఎకరాలు, 1265/3ఏలో 0.58 ఎకరాల రైతుల భూములను గల్లా రామచంద్ర నాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రైతులు ఆరోపించారు.

    తమ భూములను ఏపీఐఐసీ కి అమ్మినట్లు, వారు గల్లా ఫుడ్స్‌కు విక్రయించినట్లు రికార్డులు సృష్టించారంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈసీ కోసం రైతుల్లో కొందరు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిం ది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లోని అడంగళ్లలో పైన ఉదహరించిన సర్వే నెంబర్లలోని భూముల అనుభవదారులుగా రైతుల పేర్లు ఉన్నాయి. మొత్తం 44.87 ఎకరాల ప్రైవేట్ భూమిని అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణలు గల్లా ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇంకా కోర్టు నిర్ణయం వెల్లడికాలేదు. ఈ భూములను ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారుకాగానే 2010 సెప్టెంబర్ 7న వ్యవసాయ పొలాలు ఇండస్ట్రీ కిందకు కన్వర్షన్ అయ్యాయి.
     
    పశువుల బీళ్లను, శ్మశానాన్నీ వదల్లేదు...
     
    తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోని 323 సర్వే నెంబరులో 4.10 ఎకరాల రోడ్డు, 3.25 ఎకరాల శ్మశాన స్థలం, పశువుల బీడుగా ఉన్న 2.03 ఎకరాలను కూడా ఆక్రమించారు. ఈ భూములన్నింటినీ సక్రమంగానే కొనుగోలు చేశామనే విధంగా డాక్యుమెంట్లు సృష్టించారు. అటవీ భూములనే లాక్కున్న వారికి సాధారణ భూములు లాక్కోవడం లెక్కలోది కాదనే విషయం సుస్పష్టమే.
     
    ఏపీఐఐసీ వారు ఇచ్చిన భూమి 521 ఎకరాలు
     
    ఫ్యాక్టరీ అవసరాల పేరు చెప్పి పలువురి నుంచి అక్రమంగా లాక్కున్న భూముల్లో ఏపీఐఐసీ వారు గల్లా ఫ్యాక్టరీకి 521 ఎకరాల భూమిని ఇచ్చారు. ఏపీఐఐసీ రికార్డులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో 341.22ఎకరాలు డీకేటీ భూములు ఉండగా  180.54 ఎకరాల ప్రభుత్వ సాధారణ భూములున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement