గల్లా ‘భూ’దందాపైహైకోర్టు కన్నెర్ర | Galla land arunakumari regard to fraud | Sakshi
Sakshi News home page

గల్లా ‘భూ’దందాపైహైకోర్టు కన్నెర్ర

Published Thu, Sep 25 2014 4:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

గల్లా ‘భూ’దందాపైహైకోర్టు కన్నెర్ర - Sakshi

గల్లా ‘భూ’దందాపైహైకోర్టు కన్నెర్ర

  • మాజీ మంత్రి గల్లా అరుణకుమారి భూ అక్రమాలపై హైకోర్టులో పిల్ వేసిన గల్లా పురుషోత్తంనాయుడు
  •     

    • అక్రమాలకు పాల్పడిన గల్లా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, విచారణ చేయాలని ఏప్రిల్ 5న సీబీఐని ఆదేశించిన హైకోర్టు

         

    •  ఐదు నెలలు గడిచినా గల్లా కుటుంబీకులపై కేసు నమోదు చేయకపోవడం సీబీఐకి అక్షింతలు.. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం

    మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యుల భూ అక్రమాలపై కేసు నమోదు చేసి, విచారణ చేయాలన్న ఆదేశాలను సీబీఐ పట్టించుకోకపోవడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఐదు నెలలు గడిచినా కేసు ఎందు కు నమోదు చేయలేదో లిఖితపూర్వకంగా వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సీబీఐ ని బుధవారం హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు గల్లా కుటుంబీకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.  
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: గల్లా అరుణకుమా రి ప్రభుత్వ భూములను ఆక్రమించడంపై విచారణ చేయాలంటూ పూతలపట్టు మం డలం నల్లగట్లపల్లెకు చెందిన గల్లా పురుషోత్తంనాయుడు ప్రజా ప్రయోజన వ్యా జ్యం(పిల్) వేశారు. రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లెలో సర్వే నెంబర్ 27/4లో 2.20 ఎకరాల భూమిని అక్రమంగా గల్లా అరుణకుమారి కుటుంబసభ్యులు పొందడంపై కేసు నమోదు చేసి, విచారణ చేయాలని సీబీఐని ఆదేశిస్తూ ఏప్రిల్ 5న హైకోర్టు తీర్పును ఇచ్చింది.

    మాజీమంత్రి గల్లా అ రుణకుమారి, భర్త గల్లా రామచంద్రనాయుడు, కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కుమార్తె రమాదేవి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగభూషణంరెడ్డి తదితరులపై కేసు నమోదు చేయాల్సిన సీబీఐ.. ఐదు నెలలు గడిచినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ వస్తోంది. ఇదే అం శంపై బుధవారం హైకోర్టు మండిపడింది. కేసు విచారణలో సీబీఐ తీరును తూర్పారబట్టింది. గల్లా కుటుంబీకులపై కేసు ఎం దుకు నమోదు చేయలేదో వారం రోజు ల్లోగా లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇ వ్వాలని సీబీఐని ఆదేశించడం సంచలనం రేపింది. హైకోర్టు కన్నెర్ర చేయడంతో గల్లా కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
     
    అక్రమంగా భూమార్పిడి..

    రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఎమ్మార్‌కు 258.36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ ద్వారా 1995లో అప్పటి సీఎం ఎన్.చంద్రబాబునాయుడు ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఏపీఐఐసీకి ప్రభుత్వం అవార్డు కూడా జారీచేసింది. భూమిని అప్పగించిన తర్వాత.. అందుకు సంబంధించిన పైకాన్ని కూడా ఎమ్మార్ నుంచి ఏపీఐఐసీ రాబట్టుకుంది. కానీ.. ఎమ్మార్‌కు కేటాయించిన భూమిలో సర్వే నెంబర్ 27/4లో 2.20 ఎకరాలు గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్, కు మార్తె రమాదేవి కొనుగోలు చేసినట్లు రెవె న్యూ రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారు.

    ఆ భూమిని గల్లా అరుణకుమారి భర్త గల్లా రామచంద్రనాయుడు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారు స్వాధీనం చేశారు. ఈ స్థలం లో అపార్ట్‌మెంట్ కట్టేందుకు జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)కు దరఖాస్తు చేసుకోవడంతో.. అందుకు సంబంధిత అధికారులు అనుమతులు కూడా ఇచ్చేశారు. దాంతో ఆ భూమి లో మూడంతస్తుల భవనాన్ని కూడా నిర్మించేశారు. ఒక సంస్థకు కేటాయించిన భూమిని మరొకరు ఎలా కొనుగోలు చేస్తారన్నది వివాదంగా మారింది.
     
    అడ్డగోలుగా భూమార్పిడి..

    1995లో ఎస్.అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జి.బలరామిరెడ్డి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు గల్లా అరుణకుమారి కుటుంబీ కులు రిజిస్ట్రేషన్ కాపీలు చూపించారు. కానీ.. అంతకు ముందే ఆ భూమిని ఏపీఐఐసీ ద్వారా ఎమ్మార్‌కు కేటాయించడం గమనార్హం. ఇది రెవెన్యూ అధికారులకు తెలియంది కాదు. కానీ.. 2008లో అప్పటి మంత్రి గల్లా అరుణకుమారి తన అధికారాన్ని ఉపయోగించి అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్ జి.సుబ్బారావుపై ఒత్తిడి తెచ్చి ఆ భూమిని తమ కుటుంబసభ్యులపై మార్పిడి చేయించారు. ఆ మేరకు రెవె న్యూ రికార్డులను తిరగరాయించారు. ఇదే భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మాణానికి గల్లా రామచంద్రనాయుడు దరఖాస్తు చేయగా.. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండానే అనుమతులు ఇచ్చేశారు. ఇదే అంశంపై హైకోర్టు ఆగ్రహించింది.
     
    తక్షణమే గల్లా అరుణకుమారితోపాటు ఆమె కుటుంబ సభ్యులు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగభూషణంరెడ్డి, అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేయాలని ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. కానీ.. ఐదు నెలలుగా గల్లా అరుణకుమారి కుటుంబీకుల వైపు సీబీఐ కన్నెత్తి కూడా చూడలేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉండటం.. రాజధాని కమిటీలో సభ్యుడిగా ఉన్న నేపథ్యంతో సీబీఐ కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభు త్వ ఒత్తిళ్లకు తలొగ్గే సీబీఐ కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement