చెవిరెడ్డి కట్టడికి ‘అధికార’ కుట్ర! | Cevireddi balancing the 'official' conspiracy! | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి కట్టడికి ‘అధికార’ కుట్ర!

Published Fri, Jul 11 2014 4:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

చెవిరెడ్డి కట్టడికి ‘అధికార’ కుట్ర! - Sakshi

చెవిరెడ్డి కట్టడికి ‘అధికార’ కుట్ర!

  •       చంద్రగిరి ఎమ్మెల్యేపై పోలీసులను ఉసిగొల్పుతున్న గల్లా
  •      టీడీపీ నేతల ఆజ్ఞలకు జీ హుజూర్ అంటున్న ఎస్పీ
  •      చెవిరెడ్డిపై కేసుల వివరాలను అందించాలంటూ పోలీసులకు హుకుం
  •      ఒక్క క్రిమినల్ కేసూ లేకపోవడంపై ఆశ్చర్యం
  •      అయినా రౌడీషీట్ తెరవాలంటూ ఎస్పీపై టీడీపీ కీలకనేతల ఒత్తిడి
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి :  ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది టీడీపీ నేతల తీరు..! చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, టీడీపీ కీలకనేతలు దొడ్డిదారిని ఎంచుకున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి.. చెవిరెడ్డిని కట్టడి చేసేందుకు పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకుని.. కీలకమైన పోస్టింగ్ పొందేందుకు ఎత్తులు వేస్తున్నారు. చెవిరెడ్డిపై నమోదైన కేసుల వివరాలను తక్షణమే ఇవ్వాలంటూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేయ డం పోలీసు వర్గాలనే నివ్వెరపరిచింది. వివరాలిలా..
     
    టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సొంతూర్లు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి అప్పట్లో కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చి చెవిరెడ్డిపై పదుల సంఖ్యలో కేసులు అక్రమంగా బనాయించారనే విమర్శలు బలంగా విన్పించాయి.

    ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ప్రజలకు దన్నుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటాలు చేశారు.. ఇప్పుడు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనప్పుడు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేసినపుడు చెవిరెడ్డిపై వివిధ పోలీసుస్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేశా రు. విద్యుత్ స్తంభాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు రాయించినందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఈ కేసులన్నింటి వెనుక గల్లా అరుణకుమారి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో కలయదిరుగుతూ ప్రజలకు దన్నుగా నిలుస్తున్నారు. ఇది గల్లా అరుణకుమారి, టీడీపీ కీలకనేతలకు కంటగింపుగా మారింది. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, నక్సల్స్, ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పర్యటించకుండా చేసేందుకే ఇటీవల భద్రతను కుదించేలా టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.

    ఫలితంగా చెవిరెడ్డికి ఉన్న 2+2 భద్రతను 1+1కు కుదించారు. టీడీపీ నేతలు అంతటితో ఆగలేదు.. చెవిరెడ్డిపై రౌడీషీటర్ ముద్రవేసి అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపన్నారు. చెవిరెడ్డిపై ఎలాగైనా రౌడీషీట్ ఓపెన్ చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబుపై గల్లా అరుణకుమారితో పాటు టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

    వ్యక్తిపై దాడి, హత్యాయత్నం వంటి వా టికి పాల్పడి క్రిమినల్ కేసులు నమోదైన వారిపై మా త్రమే రౌడీషీట్ ఓపెన్ చేయాలన్నది నిబంధన. కనీ సం మూడు క్రిమినల్ కేసులు ఉన్న వారిపై మాత్రమే రౌడీషీట్ తెరవవచ్చు. కానీ.. చెవిరెడ్డిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు చెవిరెడ్డిపై నమోదైన కేసుల వివరాలను తక్షణమే అందించాలంటూ బుధవారం పోలీసులను ఆదేశించారు.

    పోలీసులు అందించిన కేసుల్లో ఒక్కటీ క్రిమినల్ కేసు లేకపోవడంతో ఏదో ఒక కేసు బనాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చెవిరెడ్డిపై ఎలాగైనా రౌడీషీట్ తెరిచి.. టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకుని, కీలకమైన పోస్టింగ్ పొందాలని ఎస్పీ వ్యూహం రచించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చెవిరెడ్డిని కట్టడి చేసేందుకు టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. అక్రమ కేసులు బనాయించే యత్నంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement