DKT lands
-
34 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై పేదలకు సర్వ హక్కులు కల్పింస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలు, రైతుల గుండె చప్పుడు విన్నది కాబట్టే మనందరి ప్రభుత్వం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వారికి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ మనస్ఫూర్తిగా మంచి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,44,866 ఎకరాలకు సంబంధించి 20,24,709 మంది పేదలకు హక్కులు కల్పించి ఆ భూములను మీ బిడ్డ ప్రభుత్వం వారి చేతుల్లో పెడుతోందన్నారు. మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయమన్నది ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేద వర్గాలను అక్కున చేర్చుకుని సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగామన్నారు. ప్రతి పేదవాడు కాలర్ ఎగరవేసి అదిగో మా అన్న ప్రభుత్వం.. మా ప్రభుత్వం.. మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే విధంగా పాలన సాగిందని చెప్పేందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాల భూమిని 42,307 మందికి కొత్తగా డీకేటీ పట్టాలు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దశాబ్దాలుగా అనుభవదారులుగా ఉన్న పేద రైతులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడంతోపాటు చుక్కల భూముల సమస్యకు సైతం పరిష్కారాన్ని చూపామన్నారు. దళితుల శ్మశాన వాటికల కోసం 1,563 గ్రామాల్లో 951 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్ భూములపై హక్కులు, కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తూ పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే పెత్తందారులకు నచ్చడం లేదని మండిపడ్డారు. పేద వర్గాల పట్ల బాధ్యతగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ, అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు, లంక భూములకు పట్టాలు, చుక్కల భూములు, షరతు గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములు 22 (ఏ) నుంచి తొలగింపు, భూమి కొనుగోలు పథకం ద్వారా అందించిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. భూములకు సంబంధించి కేవలం 53 నెలల వ్యవధిలో తీసుకున్న తొమ్మిది రకాల విప్లవాత్మక నిర్ణయాలతో పేదలు, రైతన్నలకు చేకూర్చిన మేలును వివరిస్తూ ఆయా అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. నిర్ణయం1 దేశంలో వందేళ్ల తరువాత మన ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే విజయవంతంగా పూర్తి చేశాం. మొత్తంగా 42.60 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తై యజమానులకు భూ హక్కు పత్రాలను కూడా అందజేశాం. దాదాపు 45 వేల సరిహద్దు వివాదాలను పరిష్కరించి రికార్డులను అప్డేట్ చేశాం. 15 వేల మంది సర్వేయర్లు రైతులకు మంచి చేసే విషయంలో నిమగ్నమయ్యారు. రీసర్వే పూర్తి అయిన చోటగ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే. మూడో విడత కూడా మొదలు పెడుతున్నాం. నిర్ణయం2 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు గడిచిన భూములపై లబ్ధిదారులకు సర్వహక్కులు కలి్పంచే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. దీనివల్ల 27.42 లక్షల ఎకరాలపై సంపూర్ణ హక్కులను కల్పించగా 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి జరుగుతోంది. పేద సామాజిక వర్గాలకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం ఇది. పెత్తందారీ పోకడలపై పేదల ప్రభుత్వం, మీ బిడ్డ సాధించిన గొప్ప విజయంగా ఇది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. భూములను గుంజుకునే పరిస్థితుల నుంచి అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను ఆ పేదవాడికి కలి్పంచే గొప్ప మార్పులకు ముందడుగు పడింది. చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఆక్రమించుకున్నారు. నిర్ణయం3 అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్ట్రార్ నమోదు చేసే సమయంలో వివరాలు అందుబాటులో లేని భూములను చుక్కల భూములుగా చూపించారని చంద్రబాబు ప్రభుత్వం 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22 (ఏ)లో చేర్చడంతో రైతన్నలు అల్లాడిపోయారు. రైతులు, భూములున్నాయి కానీ హక్కు పత్రాలు మాత్రం లేవు. దీనికి కారణం చంద్రబాబు ఆ భూములను నిషేధిత భూముల్లో చేర్చడమే. దీన్ని సరిదిద్దుతూ 2.6 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 1.2 లక్షల మంది రైతులకు మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది. నిర్ణయం4 పేదవాడికి భూ హక్కులు కల్పించేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ఎంత గొప్పగా అడుగులు వేసిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. 1934లో రీసర్వే రిజిస్టర్ రిమార్క్స్ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేయడంతో ఆ భూమిపై రైతులకు హక్కులు లేని పరిస్థితి నెలకొనగా ఇప్పుడు ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాం. 33,394 ఎకరాలు సాగు చేసుకుంటున్న 22,045 మంది రైతులకు మంచి చేస్తూ సర్వహక్కులు పేదవాడి చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని చెప్పేందుకు గర్వపడుతున్నా. నిర్ణయం5 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములు రుణంలో ఉండటంతో హక్కులు కోల్పోయిన ఎస్సీ రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారికి సర్వహక్కులు కలి్పంచింది కూడా మన అందరి ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలైన 22,346 మంది దళితులకు పంపిణీ చేసిన 22,387 ఎకరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటినీ 21( ఏ) జాబితా నుంచి తొలగించి రుణాలు మాఫీ చేసి రైతులకు పూర్తి హక్కులు కలి్పంచాం. నిర్ణయం6 ప్రతి పేదవాడికి సాధికారత కలి్పస్తూ చెయ్యి పట్టుకుని తోడుగా నిలిచి నా గిరిజన రైతులకు మంచి జరగాలని అడుగులు వేశాం. ఈ దిశగా పట్టాల పంపిణీ మరో ప్రధానమైన నిర్ణయం. తరతరాలుగా కొండల్లో, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మన గిరిజన సోదరులకు, గిరిజన అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని తపిస్తూ సాగు హక్కులు కలి్పంచాం. 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి చేస్తూ 3,26,982 ఎకరాలను పంపిణీ చేసింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. నిర్ణయం7 తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేకపోవడం వల్ల లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. వారంతా ఏ సహాయం అందని దుస్థితిలో ఉన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న అలాంటి రైతన్నలను గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. లంక భూముల్లో సాగు చేసుకుంటున్న వారిని ఎంజాయిమెంట్ సర్వే ద్వారా నిర్ధారించి ఏ, బీ కేటగిరీలకు డీకేటీ పట్టాలు, సీ కేటగిరికి చెందిన వాటికి లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 17,768 మంది పేద రైతులకు మంచి జరిగేలా అడుగులు ముందుకు వేసే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టాం. నిర్ణయం8 గతంలో అన్ని గ్రామాల్లో సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా కింద 22 (ఏ) కింద చేర్చారు. ఒక్క దేవాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించిన ఈనాం భూములు మినహా మిగిలిన అన్ని సరీ్వస్ ఈనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ భూములకు సంబంధించి 1,61,584 మంది రైతులకు మరీ ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి మంచి జరిగేలా, వారి సమస్య పరిష్కారమయ్యేలా నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి హక్కులు కలి్పస్తున్నాం. నిర్ణయం9 రాష్ట్రవ్యాప్తంగా మరో 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుడుతున్నాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలకు మంచి జరిగేలా అడుగులు ఇక్కడ నుంచి పడుతున్నాయి. ఇవన్నీ కేవలం 53 నెలల్లోనే భూములకు సంబంధించి చేసిన మంచి పనులు. ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఎలా చేశామో చెప్పడానికే ఈ తొమ్మిది అంశాలను ప్రస్తావించా. అంతిమ సంస్కారాల్లోనూ అంటరానితనమా? ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ ఇవాళ ఇంకో గొప్ప అడుగు పడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో ఎస్సీ వర్గాల వారి అంతిమ సంస్కారాల కోసం అనువైన భూమి లేని పరిస్థితి. తరతరాలుగా అవమానాలు ఎదుర్కొన్న వీరికి చివరికి అంతిమ సంస్కారాల విషయంలోనూ అంటరానితనం పాటించే దుస్థితి ఉంటే మనుషులుగా మనం ఏం ఎదిగినట్లు? అనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలోనూ రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,854 గ్రామ సచివాలయాల పరిధిలో శ్మశాన వాటికల కోసం 1,250 ఎకరాలు అవసరమని నివేదికలిచ్చారు. వీటిలో 1,563 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 951 ఎకరాలను సేకరించి గ్రామ పంచాయతీలకు అప్పగించాం. ఇంత చిన్న విషయాన్ని కూడా నేను పరిశీలించి పర్యవేక్షిస్తున్నా. -
ముంపుబాధితుల జీవనపోరు
డీకేటీ భూములకు ఇవ్వని పరిహారం - ఆందోళనలో ఎస్సీ, బీసీ రైతులు - ముంపుభూముల సాగుకు అటవీశాఖ అడ్డగింపు - అప్పట్లో సోమశిల బాధితుల కన్నీళ్లు తుడిచిన వైఎస్సార్! - నేడు ముంపుబాధితుల కోసం వైఎస్సార్సీపీ ర్యాలీ -కలెక్టర్‌ను కలవనున్న నేతలు, ముంపు బాధితులు రాజంపేట: వర్షాకాలం వచ్చిందంటే ముంపు బాధితులకు కష్టాలు మొదలైనట్లే. జలాశయం నిండితే గ్రామమంతా ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. వేసిన పంటలు వదిలేయాల్సిందే. అలాగని ఇంకో జీవనోపాధి ఉందా అంటే అదీ లేదు. సరైన పరిహారం ఇంతవరకు అందలేదు. కొన్నిగ్రామాల్లో భూములకు పరిహారం ఇచ్చి ఇళ్లకు ఇవ్వని పరిస్థితి. ఉద్యోగాలు లేవు. ముంపు కుటుంబా లన్నీ సాగుపైనే ఆధారపడి జీవించాలి. దీనికితోడు అటవీ అధికారుల ఆంక్షలు. దీంతో జిల్లాలోని ముంపుబాధితులు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జీవన పోరుకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. సోమశిల జలాశయానికి సంబంధించి వెనుకజలాలు జిల్లాలోని నందలూరు, ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాల్లో అనేక గ్రామాలు మునకకు గురయ్యేవి. అయితే పరి హారం ఇవ్వని కారణంగా వరద వచ్చినప్పుడు ఊర్లకు ఊర్లు వదిలి వెళ్లిపోవడం మళ్లీ నీళ్లు తగ్గిన తర్వాత గ్రా మాల్‌లోకి చేరుకోవడం లాంటివి సంఘటలతో ముంపుబాధితులు 1977 నుంచి అల్లాడిపోతూ వచ్చారు. మనోవేదనలో బాధితులు సోమశిల ప్రాజెక్టు కింద మునకకు గురయ్యే ప్రాంతాల్లోని వేలాది ఎకరాల భూముల్లో సాగు చేయనీయకుండా ఇప్పుడు అటవీ అధికారులు అడ్డుకుంటున్నారనే మనోవేదన ముంపుబాధితుల్లో ఎక్కువగా ఉంది. చాలా గ్రామాల్లో హైలెవల్ కాంటూరు పేరుతో గ్రామంలోని కట్టడాలకు పరిహారం ఇవ్వకుండా, కేవలం భూములకు పరిహారం ఇచ్చేసి అప్పుడు చేతులు దులుపుకొన్నారు. అలాంటి వాటిలో నందలూరు మండలంలోని పొత్తపి ఉంది. ఇటీవల ఆ జాబితాలో ఒంటిమిట్ట మండలంలోని పెన్నపేరూరు గ్రామం చేరింది. ఇక్కడ భూముల సాగును అటవీ అధికారులు అడ్డగించడంతో రైతులు పూర్తిస్థాయిలో వ్యతిరేకతను వ్యక్తపరిచారు. ఇలాంటి ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి. 1997 జీఓను అటవీశాఖ అడ్డంపెట్టుకొని ముంపు గ్రామాల పరిధిలో భూములును సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. బాధితుల కన్నీళ్లు తుడిచిన వైఎస్సార్ నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం కింద భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితుల కన్నీళ్లు తుడిచింది వైఎస్ రాజశేఖరరెడ్డే. 2004 ముందు టీడీపీ పాలనలో నామమాత్రంగా ముంపుబాధితుల పరిహారం అందింది. వైఎస్సార్ సీఎల్పీ లీడరుగా ఉన్న సమయంలోనే సోమశిల ముంపు గ్రామాల్లో పర్యటించారు. ముంపుబాధితుల ఇబ్బందులు, బాధలు తెలుసుకొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎలాగైనా పరిహారం ఇచ్చి ముంపుబాధితుల కన్నీళ్లు తుడవాలనుకున్నారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత అప్పటి రాజంపేట ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ బాధితుల పక్షాన ఆయనను కలిసి చర్చించారు. వారు సానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు 80శాతం మేర పరిహారాన్ని ముంపువాసులు దక్కించుకున్నారు. అప్పటి డీసీసీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ముంపుబాధితులకు పరిహారం చెల్లింపు కోసం కృషిచేశారు. నేడు ముంపుబాధితుల కోసం ర్యాలీ.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సోమశిల ముంపుబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కడప శివార్ల నుంచి ర్యాలీని చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో ముంపుబాధితులతోపాటు వివిధ రైతుసంఘాలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొననున్నారు. ముంపుబాధితులకు సకాలంలో పరిహారం ఇవ్వడం, భూములలో రైతులు చేసే సాగుకు అడ్డుతగలకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వైఎస్సార్సీపీ కోరనుంది. రూ.500కోట్ల పైచిలుకు పరిహారం ఒంటిమిట్ట, నందలూరు, అట్లూరు, గోపవరం తదితర మండలాల్లోని భవనాలకు, భూములకు సింగల్ సెటిల్మెంట్ కింద ముంపుపరిహారం చెల్లించేందుకు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఆ దిశగా పరిహారం కోసం ప్రత్యేక జీఓలను కూడా తీసుకొచ్చింది. సోమశిల ముంపు గ్రామాలకు రూ.500కోట్ల పైగా నష్టపరిహారం చెల్లింపును చేపట్టడంతో ముంపు బాధితులు కన్నీళ్లు తుడిచిన వ్యక్తిగా వైఎస్సార్ బాధితుల హృదయాల్లో నిలిచిపోయారు. 105 గ్రామాల్లోని 120 చిన్నచిన్నపల్లెలోని కట్టడాలకు, భూములకు పరిహారం చెల్లించారు. ఇందువల్ల సోమశిల జలాశయంలో 71 టీఎంసీ నీటినిల్వను ఉంచుకోగలిగారు. -
పేదల ఇళ్లపై గల్లా డేగ!
కూల్చిన ఇళ్ల మీదుగా ఫ్యాక్టరీకి దారి చుట్టుపక్కల పొలాలు,డీకేటీ భూముల ఆక్రమణ చస్తూ బతుకుతున్న లక్ష్మీపురం గ్రామస్తులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాపం పుణ్యం, మంచీ చెడ్డ మాజీ మంత్రికి పట్టవు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను అనుకున్నది జరగాల్సిందే. ఏ అధికారి అయినా, ఏ పేదవాడైనా తన మాటకు ఓకే అనాల్సిందే. పేదలకు బతుకునిస్తున్న డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములను ఆక్రమించడమో, నయానో భయానో స్వాధీనం చేసుకోవడమే కాదు.. పేదలు తలదాచుకునే ఇళ్లను సైతం కూలగొట్టించి తమ ఫ్యాక్టరీకి దారి వేసుకున్నారు. ఒక పక్క డబ్బు, మరోపక్క అధికార బలం ఉన్న మాజీ మంత్రిని ఎదిరించలేక తొమ్మిది కుటుం బాలు ఊరొదిలి పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ జీవిస్తున్న వారు సైతం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గూండా లు తమ ఇళ్లు ఎప్పుడు కూల్చేస్తారోనని భయంతో కాలం గడుపుతున్నారు. ఇదంతా పూతలపట్టు మండలం లక్ష్మీపురంలో జరుగుతోంది. క్ష్మీపురం గ్రామంలోని 42 మంది పేదలకు వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో కొందరు ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. గ్రామానికి సమీపంలో తమకు ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో లలితమ్మ, ఈశ్వరి, లక్ష్మి, జమున, గౌరమ్మ, చంద్రమ్మ, కాంతమ్మ, దేవమ్మ, జమున 2009-10లో ఇళ్లు నిర్మించుకున్నారు. లక్ష్మీపురానికి పక్కనే ఉన్న కొన్ని భూములను గల్లా అరుణకుమారి తమ గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీ కోసం అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. నయానో భయానో అక్కడున్న డీకేటీ భూములను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీకి రోడ్డు మార్గం లేదా? ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ఏ వైపు నుంచి అయినా రోడ్డు వేసుకునే అవకాశం ఉంది. అయితే, కాలనీ మీదుగా రోడ్డు నిర్మిస్తే వారంతా దూరంగా వెళతారని, ఇక ఫ్యాక్టరీకి ఎటువంటి అడ్డంకులు ఉండవనేది గల్లా ఆలోచనగా తెలుస్తోంది. దీంతో గల్లా వర్గీయులు తొమ్మిది మంది పేదల ఇళ్లు కూల్చివేశారు. తరువాత లలితమ్మకు రూ.7లక్షలు, ఈశ్వరికి రూ. 2.5 లక్షలు, లక్ష్మికి లక్ష చొప్పున డబ్బు ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వలేదు. ఇక్కడున్న కొంతమంది వడ్డెర్ల గుడారాలను ఖాళీ చేయించారు. గూండాల భయంతో దొరస్వామి అనే వ్యక్తి ఇల్లు నిర్మించేందుకు వేసుకున్న పునాదులను వదిలి తిరుపతికి వెళ్లి పోయాడు. లలితమ్మ, ఈశ్వరి బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వ రోడ్డును ఆక్రమించారు చిత్తూరు- కడప జాతీయ రహదారి నుంచి గల్లాఫుడ్స్ ఫ్యాక్టరీ మీదుగా లక్ష్మీపురానికి రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది. 15 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును ఫ్యాక్టరీలోకి కలుపుకున్నారు. దీని పక్కన మరో 20 అడుగుల కొత్తరోడ్డు వేసేందుకు స్థలాన్ని ఆక్రమించారు. ఆ స్థలంలో కొత్తరోడ్డు వేస్తూ పాతరోడ్డును తవ్వేసే కార్యక్రమాన్ని 2011 మే 23 రాత్రి చేపట్టారు. దీనిని లక్ష్మీపురం గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేపట్టడంతో తాత్కాలికంగా కొత్తరోడ్డు నిర్మాణాన్ని ఆపివేశారు. తరువాత రోడ్డువేయడంపై స్థానికులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంజక్షన్ ఇచ్చింది. అయితే పేదోళ్ల గుడిసెలు కూల్చిన ప్రాంతంలో మాత్రం రోడ్డు వేశారు. రైతుల భూములు స్వాహా... తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 299/1ఎలో 1.65 ఎకరాలు, 1బిలో 2.02 ఎకరాలు, 227/1ఎలో 32 సెంట్లు, 1బీలో 52 సెంట్లు, 2ఎ1లో 68సెంట్లు, 2ఎ2లో 68సెంట్లు, 2బిలో 1.3 ఎకరాలు, 2సీలో 3.74ఎకరాలు, 327/3లో 1.5 ఎకరాలు, 327/4లో 1.07 ఎకరాలు, 1240/1లో 4.75 ఎకరాలు, 1241లో 4.68 ఎకరాలు, 1246/1లో 4.09 ఎకరాలు, 1246/2డీలో 1.11 ఎకరాలు, 1246/2బీలో 0.6 ఎకరాలు, 1247/2ఐలో 0.94ఎకరాలు, 1247/2జేలో 1.45 ఎకరాలు, 2264లో 4.20 ఎకరాలు, 1238లో 2.01ఎకరాలు, 1239లో 4.24 ఎకరాలు, 1265/2లో 1.16 ఎకరాలు, 1265/3ఏలో 0.58 ఎకరాల రైతుల భూములను గల్లా రామచంద్ర నాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రైతులు ఆరోపించారు. తమ భూములను ఏపీఐఐసీ కి అమ్మినట్లు, వారు గల్లా ఫుడ్స్‌కు విక్రయించినట్లు రికార్డులు సృష్టించారంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈసీ కోసం రైతుల్లో కొందరు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిం ది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లోని అడంగళ్లలో పైన ఉదహరించిన సర్వే నెంబర్లలోని భూముల అనుభవదారులుగా రైతుల పేర్లు ఉన్నాయి. మొత్తం 44.87 ఎకరాల ప్రైవేట్ భూమిని అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణలు గల్లా ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇంకా కోర్టు నిర్ణయం వెల్లడికాలేదు. ఈ భూములను ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారుకాగానే 2010 సెప్టెంబర్ 7న వ్యవసాయ పొలాలు ఇండస్ట్రీ కిందకు కన్వర్షన్ అయ్యాయి. పశువుల బీళ్లను, శ్మశానాన్నీ వదల్లేదు... తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోని 323 సర్వే నెంబరులో 4.10 ఎకరాల రోడ్డు, 3.25 ఎకరాల శ్మశాన స్థలం, పశువుల బీడుగా ఉన్న 2.03 ఎకరాలను కూడా ఆక్రమించారు. ఈ భూములన్నింటినీ సక్రమంగానే కొనుగోలు చేశామనే విధంగా డాక్యుమెంట్లు సృష్టించారు. అటవీ భూములనే లాక్కున్న వారికి సాధారణ భూములు లాక్కోవడం లెక్కలోది కాదనే విషయం సుస్పష్టమే. ఏపీఐఐసీ వారు ఇచ్చిన భూమి 521 ఎకరాలు ఫ్యాక్టరీ అవసరాల పేరు చెప్పి పలువురి నుంచి అక్రమంగా లాక్కున్న భూముల్లో ఏపీఐఐసీ వారు గల్లా ఫ్యాక్టరీకి 521 ఎకరాల భూమిని ఇచ్చారు. ఏపీఐఐసీ రికార్డులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో 341.22ఎకరాలు డీకేటీ భూములు ఉండగా 180.54 ఎకరాల ప్రభుత్వ సాధారణ భూములున్నాయి.