కాంగ్రెస్ కు, మంత్రి పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లోకసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో గల్లా అరుణా కుమారి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ కు, సోనియాకు పంపినట్టు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రాజీనామా సమర్పించారు. పురందేశ్వరి, గంటా శ్రీనివాసరావు, డొక్కా మాణిక్క వరప్రసాద్ లు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.