చంద్రగిరిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు | ysr congress party cadre attacked by TDP workers in chandragiri | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

Published Mon, Apr 28 2014 8:11 AM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

ysr congress party cadre attacked by TDP workers in chandragiri

చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మాజీమంత్రి గల్లా అరుణ కుమారి అనుచరులు ఈ దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో  సుమారు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

తిరుపతి రూరల్ మండలం లక్ష్మిగణపతి కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ప్రచారం చేస్తున్న గిరిజనులపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. ఇనుప రాడ్లు, మారణాయుధాలతో దాడి చేయడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఉమాపతి, రుద్రగోపి, శంకర్, లత తీవ్రంగా గాయపడ్డారు.

 

వీరంతా ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. గల్లా అరుణ కుమారి అనుచరుల వల్ల తమకు ప్రాణ భయం వుందని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పొలీసులు సైతం గల్లా అరుణకుమారికే మద్దతుగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement