
'టీడీపీలో సీటు కోసం మంత్రి గల్లా యత్నిస్తోంది'
గుంటూరు: మంత్రి గల్లా అరుణ కుమారిపై నగర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆమె కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీ సీటు కోసం యత్నింస్తోందంటూ వారు విమర్శలకు దిగారు. తన కుమారుడితో కలిసి గుంటూరులో తిష్ట వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ నాయకులతో కలిసి ఆమె మీటింగ్ పెట్టడం నీచ సంస్కృతి నిదర్శమంటున్నారు. టీడీపీపై మోజు ఉంటే కాంగ్రెస్ కు గల్లా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి పనులు చేయడం ద్వారా కాంగ్రెస్ ను బలహీన పరచాలని చూడొద్దని నగర పార్టీ నేతలు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవద్దని ఆమెకు విజ్ఞప్తి చేశారు.