గల్లా అవినీతి డబ్బును కరిగించండి
- అవకాశ రాజకీయవాదులను తరిమికొట్టండి
- స్థానికుడైన నాకు ఒక్క అవవాశం ఇవ్వండి
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
చంద్రగిరి, న్యూస్‌లైన్: గల్లా అరుణకుమారి అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని, ఆ అవినీతి డబ్బును ప్రజలే కరిగించాలని ప్రజలకు వైఎస్‌ఆర్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి మండలం అగరాల పంచాయతీలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
అగరాల, ఐతేపల్లె, ముంగిలిపట్టు, కల్‌రోడ్డుపల్లెల్లో టీటీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 1500 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గల్లా అరుణకుమారి మన ఓట్లతో గెలిచి ప్రభుత్వ భూములు, చెరువులు, ఫారెస్ట్ భూములు, రైతుల పొలాలు, రోడ్లు, కాలువలను సైతం ఆక్రమించి ఫ్యాక్టరీలు పెట్టిందని గుర్తుచేశారు. కబ్జాలతో కోట్లు సంపాదించిన గల్లా ఆ డబ్బు ఎరచూపి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
నియోజకవర్గంలో ఒక్క ఓవర్ బ్రిడ్జి లేకపోయినా కరకంబాడిలో ఫ్యాక్టరీ కోసం రూ.35 కోట్ల ప్రజాధనంతో ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మించుకున్నారని మండిపడ్డారు. గల్లాను 3 పర్యాయాలు గెలిపిస్తే ప్రజల సమస్యలను విస్మరించి అక్రమంగా ఆస్తులను సంపాదించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. స్థానికుడైన తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా తాను తుడా చైర్మన్‌గా గ్రామాలను ఉన్నతంగా అభివృద్ధి చేశానని చెప్పారు.
ఓట్ల కోసం రాకముందే రూ.75 కోట్లతో సీసీ రోడ్లు, వైఎస్‌ఆర్ మహిళా భవనాలు నిర్మించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమేంద్రకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, ఏవీ రమణమూర్తి, ఐతేపల్లె సర్పంచ్ ఏసీ.శేఖర్, దేవారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కోటీశ్వర్‌రెడ్డి, మస్తాన్, అగరాల సర్పంచ్ సుభాన్, ఉప సర్పంచ్ మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ మాజీ అధ్యక్షుడు యశ్వంత్ చౌదరి, హేమాంబరనాయుడు, దేవరాజులనాయుడు, మాజీ సర్పంచ్ రవి, లాజర్, జయచంద్ర, దీనదయాల్ నాయుడు, రాజేంద్రనాయుడు, కల్‌రోడ్డు పల్లె ఉపసర్పంచ్ షణ్ముగం, టి. జయచంద్రారెడ్డి, టి. కృష్ణారెడ్డి, టి.రెడ్డెప్పరెడ్డి, పెద్ద ఎల్లప్పరెడ్డి, ఓ.జయచంద్రాశెట్టి, సుబ్రమణ్యంశెట్టి, మణికంఠ, సోమశేఖర్‌రెడ్డి, ఓ.యుగంధర్ తదితరులు ఉన్నారు.