ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు | Ila notices to Andhra Jyothi Press | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు

Published Sat, Apr 10 2021 4:26 AM | Last Updated on Sat, Apr 10 2021 4:32 AM

Ila notices to Andhra Jyothi Press - Sakshi

అక్కిరెడ్డిపాలెం (గాజువాక): గోడౌన్‌ కూల్చివేతపై యాజమాన్యం స్టేటస్‌కో తెచ్చుకోవడంతో ఏపీఐఐసీ ఐలా అధికారులు తదుపరి చర్యలపై కోర్టు నోటీసులను విశాఖపట్నంలోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్‌ ప్రెస్‌ గోడౌన్‌కు అంటించారు. మింది పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఏ–బ్లాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా, పరిశ్రమలు స్థాపించాల్సిన స్థలంలో భారీ గోదాములు ఏర్పాటుచేసి పలు కంపెనీలకు, సంస్థలకు లీజులకు ఇచ్చిన ఏటీఆర్‌ గోడౌన్లను కూల్చివేసేందుకు ఏపీసీఐఐసీ ఐలా అధికారులు ఉపక్రమించిన విషయం విదితమే.

ఈ గోడౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా, కనీసం సంస్థ పేరు, వివరాలు తెలిపే బోర్డు లేకుండా ఆంధ్రజ్యోతి కార్యకలాపాలు సాగుతున్నాయి. చివరకు గోడౌన్‌ యాజమాన్యం కోర్టు నుంచి స్టేటస్‌కోను తెచ్చుకోవడంతో ఏపీఐఐసీ ఐలా అధికారులు  తదుపరి చర్యల కోసం కోర్టుకు వెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement