మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్కు!
మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్కు!
Published Sun, Sep 11 2016 10:57 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
పరిశ్రమలకు మౌలిక
వసతుల ఏర్పాట్లలో ఏపీఐఐసీ
42 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు
మల్లవల్లి (హనుమాన్‌జంక్షన్ రూరల్):
బాపులపాడు మండలం మల్లవల్లిలో రీ సర్వే నెంబర్ 11లో ఉద్యాన నర్సరీ కింద ఉన్న 100 ఎకరాల భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఐఐసీ చర్యలు చేపట్టింది. మాస్టర్ ప్లాన్‌ను సైతం సిద్ధం చేసింది. తొలుత 57.45 ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్కు, తరువాత మరో 42.55 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తారు.
ఫుడ్ పార్కు మాస్టర్ ప్లాన్ ఇదే..
మల్లవల్లిలోని ఉద్యాన నర్సరీలో 57.45 ఎకరాల్లో మెగా ఫుడ్ మాస్టర్ ప్లాన్‌లో సుమారు తొమ్మిది ఎకరాలు రోడ్ల నిర్మాణానికి, 30 ఎకరాలు ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు, సీపీసీ యూనిట్లకు ఆరు ఎకరాల స్ధలాన్ని కేటాయించారు. పరిపాలన భవనం, శిక్షణా కేంద్రం, 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, సురక్షిత మంచినీటి ట్యాంక్, షాపింగ్ కాంప్లెక్స్, వేబ్రిడ్జి, విశ్రాంతి భవనాలు వంటివి వస్తాయి. నీటి శుద్ధి విభాగం, టెట్రాప్యాకింగ్ ప్లాంట్, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్, అనాలిటికల్ ల్యాబ్ వంటి వాటిని ఏపీఐఐసీ నిర్మించనుంది. మెగా ఫుడ్ పార్కులో మొత్తం 50 ఫుడ్ ప్రొసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేది పథకం. నూజివీడు మండలం మీర్జాపురంలో ఎంఎన్‌కే రహాదారి నుంచి మల్లవల్లి మెగా ఫుడ్‌పార్కు వరకు 80 మీటర్లు వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను ఏపీఐఐసీ సిద్దం చేసింది.
Advertisement
Advertisement